Friday, April 26, 2024
Friday, April 26, 2024

చైనా నుంచి వచ్చే వారిపై అమెరికా ఆంక్షలు..

చైనాలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండడంతో పలు దేశాలు అక్కడి నుంచి విదేశాలకు వెళ్లే వారికి ఆంక్షలు విధిస్తోంది. తమ దేశాల్లోకి రావాలంటే కచ్చితంగా కరోనా నెగెటివ్‌ రిపోర్టు ఉండాలని సూచిస్తుంది. తాజాగా స్వదేశీ, విదేశీయుల పై చైనా ప్రయాణ ఆంక్షలను సడలించగా.. అక్కడి నుంచి వచ్చేవారిపై రేస్ట్రిక్షన్స్‌ విధిస్తున్న దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఇప్పటికే భారత్‌, జపాన్‌, మలేషియాలు.. డ్రాగన్‌ కంట్రీ నుంచి ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. తాజాగా ఈ జాబితాలో అమెరికా కూడా చేరింది. చైనాలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మీడియా వర్గాలు తెలిపాయి. చైనా నుంచి వచ్చేవారు నెగెటివ్‌ సర్టిఫికెట్‌ చూపించాలన్నారు. వచ్చే నెల 5వ తేదీ నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని అమెరికా తెలిపింది. చైనా నుంచి నేరుగా కాకుండా సియోల్‌, టొరంటో, వాంకోవర్‌ మీదుగా వచ్చే ప్రయాణికులకు కూడా ఇదే షరతు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img