Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

చైనా శాంతికాముక దేశం

ఆధిపత్యవాదం, అధికార రాజకీయాలను ఖండిరచిన జిన్‌పింగ్‌

బీజింగ్‌ : పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా (సీపీసీ)ను ఐరాస గుర్తించి 50 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ మాట్లాడుతూ చైనా ఎల్లప్పుడూ శాంతికి సంబంధించిన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరిస్తుం దన్నారు. న్యాయాన్ని సమర్థిస్తుందని పేర్కొన్నారు. ఆధిపత్యవాదం, అధికార రాజకీయాలను వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు. ఉగ్రవాదం, వాతావరణ మార్పు, సైబర్‌ భద్రత, బయోసెక్యూరిటీ వంటి సమస్యలను పరిష్కరించడానికి దేశాలన్నీ కలిసి పని చేయాలని జిన్‌పింగ్‌ సూచించారు. 1971లో ఐరాస పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనాను గుర్తించింది. సమగ్ర ప్రపంచ పాలన, ప్రభావవంతమైన బహుపాక్షిక విధానాలు, చురుకైన ప్రాంతీయ సహకారం ఏర్పాటు చేయడం ద్వారా మాత్రమే మనం వివిధ సమస్యలను సమర్థవం తంగా ఎదుర్కోగలమని అన్నారు. ట్రంప్‌ పాలనలో వాణిజ్య యుద్ధం చెలరేగినప్పటి నుంచి చైనా, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు కొనసా గుతున్నాయి. జిన్‌పింగ్‌ , బైడెన్‌ అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత మొదటి శిఖరాగ్ర సమావేశాన్ని వీడియో ద్వారా నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. వాషింగ్టన్‌లో వచ్చే నెల సమావేశం నిర్వహిం చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత కోసం చైనా నూతన సరిహద్దు చట్టాన్ని అమల్లోకి తీసు కొచ్చింది. సమానత్వం, పరస్పర విశ్వాసం ప్రాతిపదికగా స్నేహపూర్వక సంప్రదింపుల సూత్రం ద్వారా సరిహద్దు వ్యవహారాలను నిర్వహిం చనున్నట్లు పేర్కొంది. ఈ చట్టం వచ్చే ఏడాది జనవరి 1 నుండి అమల్లోకి రానుంది. సరిహద్దుల్లో చైనా ప్రజలు నివసించేలా, పని చేసుకునేలా ప్రోత్సహించనున్నట్లు వివరించింది. మౌలిక సదుపాయాల కల్పన, సరిహద్దు రక్షణ, ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img