Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

జాతీయజెండా ఆవిష్కరణలో ఉద్రిక్తత

తాలిబన్ల అదుపులో తొలి మహిళా గవర్నర్‌..!
అఫ్గాన్‌ తొలి మహిళా గవర్నర్‌ సలీమా మజారీని తాలిబన్లు అదుపులోకి తీసుకున్నారు. తొలితరం మహిళా గవర్నర్లలో ఒకరిగా సలీమా బల్‌ ప్రావిన్స్‌లోని చహర్‌ కింట్‌ జిల్లాకు చెందినవారు. తాలిబన్లతో పోరాటానికి తుపాకీ పట్టిన అఫ్గాన్‌ మహిళ. బల్‌ ప్రావిన్స్‌ను తాలిబన్లు ఆక్రమించకుండా అమె వీరోచిత పోరాటం చేశారు. కానీ, తాలిబన్లు ఆప్రాంతంపై పట్టుసాధించి సలీమాను అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. సలీమా రైతులు, గొర్రెల కాపరులు, కార్మికులతో కలిసి తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడారు. మరోవైపు అఫ్గాన్‌ తాలిబన్ల వశమైన నేపధ్యంలో అక్కడి మహిళలు తమ హక్కుల కోసం నినదిస్తున్నారు. తాలిబన్ల పాలనలో మహిళలు తమ హక్కులకు తీవ్ర భంగం వాటిల్లో అవకాశం ఉందని ఆందోళన వెలిబుచ్చారు. కాబూల్‌ వీధుల్లో నలుగురు మహిళలు తమ హక్కులు కాపాడుకుంటామంటూ ప్లకార్డులు చేపట్టి ప్రదర్శనలో పాల్గొన్నారు. ఇస్లామిక్‌ చట్టాల ప్రకారం మహిళలకు అన్ని హక్కులు కల్పిస్తామని తాలిబన్లు తొలి మీడియా సమావేశంలో ప్రకటించిన విషయం తెలిసిందే…

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img