Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

తైవాన్‌లో కాలుపెడితే భారీ మూల్యం తప్పదు.. అమెరికాకు చైనా వార్నింగ్‌

తైవాన్‌ పర్యటనపై అమెరికాకు చైనా గట్టి వార్నింగ్‌ ఇచ్చింది. వైట్‌హౌస్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటిస్తే.. అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుందని చైనా హెచ్చరించింది. తైవాన్‌ను తన భూభాగంగా పరిగణిస్తున్న చైనా.. ఆ ప్రాంతం విషయంలో అమెరికా జోక్యం చేసుకుంటే సహించేది లేదని పదే పదే హెచ్చరికలు చేస్తోంది. తాజాగా, ఆసియా పర్యటనకు వచ్చిన వైట్‌హౌస్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసీ .. తైవాన్‌లో పర్యటించనున్నారనే వార్తలపై చైనా భగ్గుమంది. ఒకవేళ తైవాన్‌లో నాన్సీ పెలోసీ పర్యటిస్తే చూస్తూ ఊరుకోబోమని, అందుకు అమెరికా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హూ చూన్యింగ్‌ బీజింగ్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘‘చైనా సార్వభౌమ భద్రతా ప్రయోజనాలకు భంగం కలిగితే అమెరికా పక్షం బాధ్యత వహించక తప్పదు. అందుకు తగిన మూల్యం చెల్లించుకుంటుంది.’’ అని హెచ్చరించారు. తైవాన్‌కు మద్దతుగా అమెరికా అధికారులు పర్యటిస్తున్నప్పటికీ.. పెలోసీ వంటి అత్యున్నత హోదాలో ఉన్న వ్యక్తి సందర్శించిన దాఖలాలు గతంలో ఎప్పుడూ లేవు. ఈ పర్యటన చైనా-అమెరికా మధ్య ఉద్రిక్తతలకు దారితీయవచ్చని మీడియా పేర్కొంటోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img