Friday, April 26, 2024
Friday, April 26, 2024

నవంబరులో సీపీసీ ఆరో ప్లీనరీ

బీజింగ్‌: 2022లో నాయకత్వ మార్పుకు ముందు నవంబరులో చైనా కమ్యూనిస్టుపార్టీ (సీపీసీ) కీలక సమావేశం నిర్వహించడానికి సిద్ధమైంది. సీపీసీ సెంట్రల్‌ కమిటీ ఆరో ప్లీనరీ సమావేశాన్ని నవంబరు 8 నుంచి 11వరకు చైనా రాజధాని బీజింగ్‌లో నిర్వహించనున్నారు. పార్టీ వ్యవస్థాపకుడు మవో జెడాంగ్‌ తర్వాత అత్యంత శక్తివంతమైన నాయకుడిగా అవతరించిన జిన్‌పింగ్‌ (68)కి ఇది కీలక సమావేశంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో సీపీసీ 100 సంవత్సరాల ప్రస్థానంలో సాధించిన విజయాలు, చారిత్రక అనుభవాల ఆధారంగా కీలక తీర్మానం చేయనుంది. పార్టీ పొలిటికల్‌ బ్యూరో తీర్మానంలో నివేదిక కోసం అభిప్రాయాలు, చర్చల కోసం ముసాయిదాను సమర్పించాలని నిర్ణయించినట్లు జిన్హువా వార్తా సంస్థ పేర్కొంది. నాయకత్వ మార్పుకు ముందు జరిగే అతి పెద్ద పార్టీ సమావేశం కావడంతో ఆరవ ప్లీనరీ సెషన్‌ ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. చైనా అగ్రనాయకులందరూ సీపీసీ జనరల్‌ సెక్రటరీ పదవి తర్వాత అధికారాన్ని చేపట్టారు. జిన్‌పింగ్‌ పూర్వీకులందరూ తప్పనిసరిగా రెండు ఐదేళ్ల కాల వ్యవధిని అనుసరించి రిటైర్‌ అయ్యారు. జిన్‌పింగ్‌ రెండు సంవత్సరాల కాలపరిమితిని తొలగించిన తరువాత 2018లో రాజ్యాంగ సవరణను దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాది చివరిలో జిన్‌పింగ్‌ రెండవ పదవీకాలం ముగియనుంది. సెంట్రల్‌ కమిటీలో 370 మందికిపైగా సభ్యులు ఈ ప్లీనరీ సమావేశంలో పాల్గొంటారు. జిన్‌పింగ్‌తోపాటు ప్రదాని లీ కెకియాంగ్‌ కూడా 2023 ప్రారంభంలో తన రెండు కాల పరిమితులను పూర్తి చేస్తారు. పొలిట్‌బ్యూరోలోని 25 మంది సభ్యులలో దాదాపు డజనుమంది వచ్చే ఏడాది అక్టోబరు నాటికి 68సంవత్సరాలకంటే పైబడిన వారే..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img