Friday, April 26, 2024
Friday, April 26, 2024

పార్లమెంటులో అడుగిడిన రిషి


లండన్‌ : భారత్‌`సంతతికి చెందిన బ్రిటన్‌ ప్రధాన మంత్రి రిషి సునాక్‌ బుధవారం పార్లమెంటులో అడుగుపెట్టారు. బుధవారం రోజంతా రిషి తన నూతన మంత్రుల బృందం సమావేశంలో పాల్గొన్నారు. బ్రిటన్‌ రాజకీయాల్లో ప్రధాన కార్యక్రమంగా ప్రతి బుధవారం జరిగే పార్లమెంటులో ‘‘ప్రధానమంత్రి ప్రశ్నలు’’ (పీఎంక్యూ)లో ప్రతిపక్ష నాయకుడు కీర్‌ స్టార్‌మర్‌ అడిగిన ప్రశ్నలకు రిషి దీటుగా సమాధానం చెప్పారు. ఎంపీలు ఏ అంశంపైనైనా అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి పార్లమెంటు ఛాంబర్‌లో అర్ధగంటపాటు ప్రధాని నిలబడతారు.
మొదటిసారిగా ప్రభుత్వాధినేతగా రిషి మంగళవారం తన మంత్రివర్గాన్ని నియమించారు. ఆర్థిక స్థిరత్వం కోసం నూతన ఛాన్సలర్‌గా జెరిమీ హంట్‌ను నియమించాలని నిర్ణయించారు. భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రవర్మన్‌ను హోంమంత్రిగా నియమించారు. సునాక్‌ విధేయుడు కానప్పటికీ విదేశాంగ మంత్రిగా జేమ్స్‌ క్లవర్లీని కొనసాగించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు.
‘‘పార్టీ చాలా చాలా ఐక్యంగా ఉంది’’ అని 10 డౌనింగ్‌ స్ట్రీట్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశం తరువాత బయటకు వచ్చిన ఫోర్టుఫోలియో లేని మంత్రి నధీమ్‌ జహావీ విలేకరులకు చెప్పారు. ‘‘సమగ్రత’’తో పాలించేందుకు రిషి ప్రతిజ్ఞ చేశారు. తన మంత్రివర్గంలోకి పార్టీలోని విభిన్న విభాగాల నుండి వ్యక్తులను తీసుకోవడం ద్వారా కన్జర్వేటివ్‌లను ఐక్యపరిచేందుకు రిషి ప్రయత్నం చేశారు. అయితే, బ్రవర్మన్‌ను తిరిగి నియమించాలన్న నిర్ణయాన్ని ప్రతిపక్ష లేబర్‌ పార్టీ విమర్శించింది. బ్రవర్మన్‌ నియామకాన్ని విదేశాంగ మంత్రి క్లవర్లీ సమర్ధించారు. ‘‘పొరపాటు చేశానని ఆమె చెప్పి అందుకు ఆమె క్షమాపణ కూడా చెప్పింది’’ అని క్లవర్లీ బీబీసీకి తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img