Friday, April 26, 2024
Friday, April 26, 2024

పీఎల్‌ఏ శతవార్షిక లక్ష్యాలపై దృష్టి

సైన్యానికి జిన్‌పింగ్‌ పిలుపు


బీజింగ్‌: ‘పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ’ (ప్రజా విమోచన సైన్యం`సీపీసీ) శతవార్షికోత్సవ సంవత్సరమైన 2027 నాటికి పూర్తిచేయవలసిందిగా సీపీసీ సెంట్రల్‌ కమిటీ సాయుధ బలగాలకు రూపొందించిన లక్ష్యాలను సాధించవలసిందిగా సాయుధ బలగాలను చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) ప్రధాన కార్యదర్శి జిన్‌పింగ్‌ చైనా సైన్యానికి సోమవారం విజ్ఞప్తి చేశారు. చైనాను నవీనీకరించేందుకు, సోషలిస్టు దేశం నిర్మించేందుకు వ్యూహాత్మకంగా ముందుగా అవసరమైన ప్రపంచశ్రేణి బలగంగా చైనా సైనిక నిర్మాణాన్ని పీఎల్‌ఏ శతవార్షికోత్సవం నాటికి చైనా సైన్యం పూర్తిచేయాలని జిగ్‌పింగ్‌ పేర్కొన్నారు. ఆదివారం ముగిసిన సీపీసీ మహాసభల తరువాత తొలి సైనిక సమావేశంలో ఉన్నతశ్రేణి సైనికాధికారులతో జిగ్‌పింగ్‌ మాట్లాడారు. రానున్న ఐదేళ్లలో చైనా సాయుధ బలగాలకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని చైనా అధ్యక్షుడు, సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ చైర్మన్‌ కూడా అయిన జిన్‌పింగ్‌ పిలుపిచ్చారు. అందుకొరకు, 2027 నాటికి ఆ లక్ష్యాలను సాధించడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
సైన్యం బలోపేతానికి పార్టీ ఆలోచనను సాయుధ బలగాలలోని సభ్యులందరూ క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలని, పార్టీ ఆలోచనా సారాంశాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసి ప్రపంచశ్రేణి సైన్యంగా చైనా సైన్యాన్ని నిర్మించేందుకు దృష్టి కేంద్రీకరించాలని ఆయన పేర్కొన్నారు. పీఎల్‌ఏ శతవార్షికోత్సవ లక్ష్యాలను నెరవేర్చడానికి కమాండర్లు, అధికారులు, సైనికులు కృషిచేసి, పటిష్టమైన శిక్షణ ఇవ్వాలని జిన్‌పింగ్‌ ఉద్ఘాటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img