Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ప్రపంచంలో తెలివైన విద్యార్థినిగా ఇండియన్‌`అమెరికన్‌ బాలిక

వాషింగ్టన్‌ : శాట్‌, యాక్ట్‌ ప్రామాణిక పరీక్షల్లో ఇండియన్‌అమెరికన్‌కు చెందిన 11 ఏళ్ల నటాషా పెరి ప్రపంచంలోనే తెలివైన విద్యార్థినుల్లో ఒకరిగా నిలిచినట్టు యూఎస్‌ యూనివర్సిటీ తెలిపింది. స్కోలాస్టిక్‌ అసెస్మెంట్‌ టెస్ట్‌ (శాట్‌), అమెరికన్‌ కాలేజీ టెస్టింగ్‌ (యాక్ట్‌) ప్రామాణిక పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను మాత్రమే అమెరికాలోని కాలేజీలు ప్రవేశాలకు అనుమ తి ఇస్తాయి. మరికొన్ని సందర్భాల్లో కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలు కూడా స్కాలర్‌షిప్స్‌ ఇచ్చేందుకు శాట్‌, యాక్ట్‌ ఇచ్చిన స్కోరింగ్‌పైనే ఆధారపడతాయి. కాలేజీల్లో చేరాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా శాట్‌, యాక్ట్‌ స్కోరింగ్‌ను ఆయా కళాశాలల్లో సమర్పించాల్సి ఉంటుంది. నటాషా పెరీ న్యూజెర్సీలోని థెల్మా ఎల్‌ శాండమీర్‌ ఎలిమెంటరీ స్కూల్‌ విద్యార్థిని. జాన్స్‌ హోప్‌కిన్స్‌ సెంటర్‌ ఫర్‌ టాలెంటెడ్‌ యూత్‌ (సీటీవై) సెర్చ్‌లో భాగంగా శాట్‌, యాక్ట్‌లలో అసైన్‌మెంట్స్‌ తీసుకుని ప్రతిభ చూపింది. 202021 సీటీవై టాలెంట్‌ సెర్చ్‌లో భాగంగా 84 దేశాల నుంచి సుమారు 19వేల మంది విద్యార్థుల్లో ఆమె ఒకరిగా నిలిచింది. విద్యార్థుల్లో దాగి ఉన్న విశాలమైన ప్రతిభ వెలికితీతలో భాగంగా సీటీవై ఈ టాలెంట్‌ సెర్చ్‌ పరీక్షను చేపట్టింది. ఆమె గ్రేడ్‌5లో ఉండగా, 2021లో జాన్స్‌ హోప్‌కిన్స్‌ టాలెంట్‌ సెర్చ్‌ పరీక్ష రాసింది. వెర్బల్‌, క్వాంటిటేటివ్‌ సెక్షన్స్‌లో ఆమె 90 శాతం సాధించి గ్రేడ్‌8ని సొంతం చేసుకుంది. దీంతో జాన్స్‌ హోప్‌కిన్స్‌ ప్రకటించిన ‘హై హానర్‌ అవార్డు’కు అర్హత సాధించింది. జేఆర్‌ఆర్‌ టోల్‌కిన్స్‌కు చెందిన నవలలను క్షుణ్ణంగా చదివిన కారణంగానే తను ఈ అవార్డుకు అర్హత సాధించానని ఆమె తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img