Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

బోల్సోనారో అభిశంసనకు సెనెట్‌ మద్దతు

బ్రసీలియా : దేశంలో కోవిడ్‌ మహమ్మారిని అరికట్టడంలో బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సోనారో ఘోరంగా విఫలమయ్యారని ఆయనపై క్రిమినల్‌ అభియోగాలు మోపాలని బ్రెజిలియన్‌ సెనేటర్లు మద్దతు పలికారు. కరోనా మహమ్మారితో దేశంలో దాదాపు ఆరులక్షల మంది మరణించిన నేపధ్యంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై బ్రెజిల్‌ సెనేట్‌ కమిటీ ఆరునెలలుగా విచారణ జరిపింది. ఈ క్రమంలో అధ్యక్షుడిపై క్రిమినల్‌ అభియోగాలు మోపాలని కమిటీ సిఫార్సు చేసింది. ఈ నివేదికను బోల్సోనారో నియమిచిన చీఫ్‌ప్రాసిక్యూటర్‌కు సెనేట్‌ ప్యానెల్‌ అందచేసింది. అయితే కచ్చితంగా నేను ఏ నేరాన్ని చేయలేదని బోల్సోనారో పేర్కొన్నారు. అమెరికా తర్వాత కరోనా మరణాల్లో బ్రెజిల్‌ రెండవ స్థానంలో ఉంది. 20.8 కోట్లు ఉన్న జనాభాలో కనీసం 6,06,000 మంది కరోనా కారణంగా మరణించగా 2.17 కోట్ల మందిపై కరోనా కేసులు నమోదయ్యాయని జాన్‌ హాప్‌కిస్స్‌ విశ్వవిద్యాలయం నివేదించింది. ’కరోనా మహమ్మారి సమయంలో ప్రభుత్వం చేసిన తప్పులకు బాధ్యత వహించే ప్రధాన వ్యక్తి అధ్యక్షుడు’’ అని ఈ నివేదిక పేర్కొంది. నిధుల దుర్వినియోగంతో పాటూ కరోనా వ్యాప్తిపై అధ్యక్షుడు తప్పుడు వార్తలు వ్యాప్తి చేశారనే ఆరోపణలు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img