Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మేమొస్తేనే మార్పొస్తుంది

. ఎర్దోగన్‌ శకం ముగింపే లక్ష్యం
. మే 14న ఎన్నికల్లో ఒంటరిగా పోటీ
. టర్కీ కమ్యూనిస్టు పార్టీ ప్రకటన

అంకార: టర్కీ కమ్యూనిస్టు పార్టీ (టీకేపీ) అధికారంలోకి వస్తే టర్కీలో మార్పు రాగలదని ఆ పార్టీ తాజా ప్రకటనలో ఉద్ఘాటించింది. ఎర్దోగన్‌ శకానికి ముగింపు పలకడమే లక్ష్యమని తెలిపింది. ప్రస్తుత ఏకేపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు, ఎర్దోగన్‌ నియంతృత్వానికి చరమగీతం పాడేందుకు పార్టీవర్గాలు కంకణబద్ధులై శ్రమిస్తున్నట్లు టీకేపీ వెల్లడిరచింది. మే 14న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. 81 ప్రావిన్సులకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలిపింది. అదేరోజు జరగబోయే అధ్యక్ష ఎన్నికల కోసం కమల్‌ కిలిడారుగ్లుకు మద్దతివ్వాలని పిలుపునిచ్చింది. టర్కీలోని సామ్యవాద, లౌకిక వ్యతిరేక నిరంకుశ పరిపాలనకు చెక్‌ పెట్టాలంటూనే ఎన్నికల కోసం ఏకతాటిపైకి రావాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పింది. మేలో జరగబోయే పార్లమెంటరీ ఎన్నికల్లో కలిసిరావాలని కోరింది. చరిత్రాత్మక కమ్యూనిస్టు ఉద్యమాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళతామని తెలిపింది. ఎన్నికల కోసం ప్రచారంతో పాటు సంస్థాగత పనుల ద్వారా ఓటర్లలో అవగాహన పెంచుతామని పేర్కొంది. ప్రత్యామ్నాయ నాయకత్వం లేకుండా ప్రజలను అనాధులుగా సోషలిస్టులు చేయరాదన్నది. ఎర్దోగన్‌ శకాన్ని ముగించాలన్నదే శ్రామికులు, మహిళలు, యువత కోరుకునేదిగా తెలిపింది. టర్కీ మళ్లీ బలంగా ఎదగాలన్నా, స్వతంత్రతను పునరుద్ధరించుకోవాలన్న అది కమ్యూనిజంతోనేనని నొక్కిచెప్పింది. కమ్యూనిజంతోనే ఎర్దోగన్‌ శకానికి ముగింపు సాధ్యమని పునరుద్ఘాటించింది. ఏకేపీ ఏ విధంగా దేశాన్ని చీకట్లోకి నెట్టివేసినది ప్రజలకు తెలియజేస్తామని వెల్లడిరచింది. టర్కీ కమ్యూనిస్టు పార్టీ బలంగా, సుస్థిరంగా, స్పష్టమైన వైఖరితో ఉందని పేర్కొంది. ఏకేపీని ఎన్నికల్లో ఓడిస్తే అది నేషనల్‌ అలయెన్స్‌ (లిబరల్‌ఇస్లామిస్ట్‌ఫాసిస్ట్‌ సంయుక్త శక్తులు) విజయమే అవుతుందని తెలిపింది. ఈసారి ఎన్నికల్లో ఏకేపీతో పాటు ఎర్దోగన్‌కు చెక్‌ పెట్టడమే కాకుండా మా ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తూ మందుకెళతామని టర్కీ కమ్యూనిస్టు పార్టీ పేర్కొంది. సుసంపన్నత, సమానత్వం, సౌభాగ్యత, స్వేచ్ఛ, న్యాయం ఉండే సోషలిస్టు టర్కీ కోసం టీకేపీని నమ్మండి.. టీకేపీకి ఓటు వేయండి… మళ్లీ శిథిలాల కింద నలిగిపోనివ్వం… టీకేపీ వస్తే అంతా మారుతుంది.. టీకేపీతోనే మార్పు వస్తుంది’ అని టర్కీ కమ్యూనిస్టు పార్టీ పిలుపునిచ్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img