Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సామాజిక రుగ్మతలకు సోషలిజమే మార్గం

వియన్నా : దేశంలో నెలకొన్న పెట్టుబడీదారీ సంక్షోభం, ఆరోగ్యవ్యవస్థ, జీవావరణ సమస్యలు, సామ్రాజ్యవాదం, సైనికవాదం, యుద్ధ సంక్షోభం,వర్గ పోరాటాలకు సోషలిజం`కమ్యూనిజం సిద్ధాంతం పరిష్కారమని పార్టీ ఆఫ్‌ లేబర్‌ ఆఫ్‌ ఆస్ట్రియా (పీడీఏ) చైర్మన్‌ టిబోర్‌ జెంకర్‌ పేర్కొన్నారు. ‘మీ సంక్షోభానికి మేం మూల్యం చెల్లించం’’ అన్న బానర్‌తో వియన్నాలోని వీడెనర్‌ వాణిజ్యమండలిలో జరిగిన సమావేశంలో పార్టీ చైర్మన్‌, కమ్యూనిసు ్టయూత్‌ ఆఫ్‌ ఆస్ట్రియా (కేజీఓ) మాజీ చైర్మన్‌ రాఫెల్‌ స్కోబెర్ల్‌ ప్రసంగించారు. ఆస్ట్రి యాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితికి బూర్జువావర్గాల నిరంకుశ విధానాలే కారణమని పేర్కొన్నారు. సామూహిక లేఆఫ్‌లు, వేతనాల తగ్గింపు, గుత్తా ధిపత్య ధోరణులు, సంక్షోభాలు, కార్మికవర్గంపై పెను ప్రభావం చూపాయి. ఆస్ట్రియా ప్రజల ప్రజాస్వామ్య హక్కులను పీడీఏ సమర్థిస్తుందని జెంకర్‌ నొక్కి చెప్పారు. దోపిడీ, అణచివేతలకు బలవుతున్న ప్రజలకు పీడీఏ సంఘటితంగా నిలుస్తుందన్నారు. సామాజిక ప్రజాస్వామ్యానికి, ప్రజల స్వాతంత్య్రానికి పీడీఏ ప్రజలకు అన్ని వేళలా తోడ్పాటునందిస్తుందని పీడీఏ చైర్మన్‌ పేర్కొన్నారు. రానున్నకాలంలో పీడీఏ సామాజిక ప్రజాస్వామ్య కార్మిక హక్కులపై మరింతగా దృష్టి సారిస్తుందని పేర్కొన్నారు. గుత్తాధిపత్య సంక్షోభం కార్మికవర్గంపై పెను ప్రభావం చూపిందని పేర్కొన్నారు. కరోనా నేపధ్యంలో సమాజాన్ని విభజించే ప్రయత్నాలను పీడీఏ వ్యతిరేకిస్తుందని జెంకర్‌ నొక్కి చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img