Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

6.7 కోట్ల మంది చిన్నారులు వాక్సిన్లకు దూరం

పెరిగిన పోలియో, మీజిల్స్‌ ముప్పు: యూనిసెఫ్‌
జెనీవా: కరోనా మహమ్మారి విజృంభణతో 2019 నుంచి 2021 వరకు 6.7 కోట్ల మంది చిన్నారులకు సాధారణ వాక్సిన్లు సక్రమంగా అందలేదని యూనిసెఫ్‌ వెల్లడిరచింది. తద్వార చిన్నారులలో రోగనిరోధకతకు తగ్గిందని తాజా నివేదికలో పేర్కొంది. ఒక దశాబ్దానికిపైగా కష్టపడి సంపాదించిన లాభాలు క్షీణించిపోయాయని తెలిపింది. మరలా పూర్వ పరిస్థితి నెలకొనడం పెద్ద సవాల్‌గా మారిందని తెలిపింది. ఆఫ్రికా, దక్షిణాసియా దేశాలపై ఈ ప్రభావం అధికంగా ఉందని పేర్కొంది. కరోనా కాలంలో సాధారణ వాక్సిన్లకు అంతరాయం ఏర్పడిన 6.7 కోట్ల చిన్నారుల్లో 4.8 కోట్ల మంది పూర్తిగా టీకాలకు దూరమయ్యారని నివేదిక పేర్కొంది. పోలియో, మీజిల్స్‌ వంటివి మళ్లీ పెరిగే అవకాశం ఉందని యూనిసెఫ్‌ హెచ్చరించింది. 112 దేశాల్లో టీకా కవరేజీ క్షీణించిందని, ప్రపంచవ్యాప్తంగా టీకాలు తీసుకున్న చిన్నారుల శాతం ఐదు పాయింట్లు పడిపోయి 81 శాతానికి తగ్గిందని తెలిపింది. 2008 తర్వాత ఇంత తక్కువగా నమోదవడం ఇదే మొదటిసారని వెల్లడిరచింది. మీజిల్స్‌ వాక్సిన్‌ తీసుకున్న వారి సంఖ్య 86 నుంచి 81 శాతానికి తగ్గిందని తెలిపింది. పర్యవసానంగా మీజిల్స్‌ కేసులు 2021 కంటే 2022లో రెండిరతలు నమోదయ్యాయని పేర్కొంది. సాధారణ వాక్సినేషన్‌ ద్వారా ఏటా 44లక్షల మంది ప్రాణాలను కాపాడుకుంటున్నారని, 2030 నాటికి ఈ సంఖ్య 58 లక్షలకు పెరగాలన్నదే యూనిసెఫ్‌ లక్ష్యమని నివేదిక వెల్లడిరచింది. వాక్సిన్లు లేక 963కు ముందు ఏటా 26 లక్షల మరణాలు సంభవించేవని గుర్తుచేసింది. ఈ సంఖ్య 2021 నాటికి లక్షా 28 వేలకు తగ్గిందని చెప్పింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img