Friday, April 26, 2024
Friday, April 26, 2024

రష్యాకు వ్యతిరేకంగా ఐరాసలో భారత్‌ ఓటు

వాషింగ్టన్‌: ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో రష్యాకు వ్యతిరేకంగా భారతదేశం తొలిసారిగా ఓటు వేసింది. ఉక్రెయిన్‌పై రష్యాసైనిక చర్య ప్రారంభమైన తర్వాత భద్రతామండలి(యుఎన్‌ఎస్‌సీ) లో జరిగే చర్చలు, ఓటింగ్‌లో భారత్‌ తటస్తవైఖరి ప్రదర్శించింది. అయితే చైనా మాత్రం ఈ ఓటింగ్‌కు దూరంగా ఉంది. ఉక్రెయిన్‌ 31వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా యుద్ధ పరిస్థితులను సమీక్షించేందుకు యుఎన్‌ఎస్‌సీ సమావేశమైంది. ఇందులో భాగంగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వీడియో సమావేశం ద్వారా ప్రసంగించడాన్ని వ్యతిరేకించిన రష్యా ప్రొసీజరల్‌ ఓటింగ్‌ను కోరింది. దీనితో భద్రతామండలిలోని ఐదు శాశ్వత సభ్యదేశాలు, భారత్‌ సహా 10 తాత్కాలిక సభ్యదేశాలలో 13 దేశాలు జెలెన్‌స్కీ ప్రసంగానికి అనుకూలంగా ఓటువేశారు. రష్యా ఈ ప్రసంగాన్ని వ్యతిరేకించగా చైనా ఓటింగ్‌కు దూరంగా ఉంది. 13సభ్య దేశాల మద్దతులో జెలెన్‌స్కీ ప్రసంగించారు. ఐరాస భద్రతామండలిలో తాత్కాలిక సభ్య దేశంగా భారత్‌ పదవీకాలం ఈ ఏడాది డిసెంబరుతో ముగియనుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img