Friday, April 26, 2024
Friday, April 26, 2024

శాంతి పరిరక్షణలో వ్యూహాత్మక
కమ్యూనికేషన్లకు ప్రాముఖ్యత: ఐరాస

ఐక్యరాజ్యసమితి: ప్రపంచ శాంతిపరిరక్షణలో వ్యూహాత్మక కమ్యూనికేషన్ల ప్రాముఖ్యతను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నొక్కి చెప్పింది. ఐరాస శాంతి పరిరక్షణ ద్వారా వ్యూహాత్మక సమాచారాలు, సంబంధిత ఆదేశాలపై ప్రజల్లో అవగాహనను బలోపేతం చేయడం, అంచనాలను నిర్వహించడం, ప్రజల మధ్య విశ్వాసం, మద్దతును పొందడం తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడానికి దోహదం చేస్తుందని ఐరాస భద్రతామండలి పేర్కొంది. వ్యూహాత్మక సమాచార మార్పిడికి ప్రజల్లో విశ్వాసం పెంపుదలకు, సైనిక, పోలీసు, పౌర విభాగాల మధ్య సమన్వయాన్ని కమ్యూనికేషన్‌ సులభతరం చేస్తుందని భద్రతా మండలి పేర్కొంది. యుఎన్‌ శాంతి పరిరక్షక కార్యకలాపాలలో పౌర, సైనిక, పోలీసు విభాగాలలో వ్యూహాత్మక కమ్యూనికేషన్ల సంస్కృతిని మెరుగుపరచాల్సిన అవసరాన్ని భద్రతామండలి నొక్కి చెప్పింది. భద్రతా మండలి యుఎన్‌ శాంతి పరిరక్షణ డిజిటల్‌ పరివర్తన కోసం ఒక వ్యూహాన్ని అభివృద్ధి చేసింది. శాంతి పరిరక్షకుల భద్రతను పెంపొందించేందుకుగాను ఇప్పటికే ఉన్న కమ్యూనికేషన్‌ టెక్నాలజీలను ఉపయోగించుకోవచ్చునని సూచించింది. శాంతి పరిరక్షక కార్యకలాపాల వ్యూహాత్మక సమాచార సామర్థ్యాలను మెరుగుదలను భద్రతా మండలి గుర్తించింది. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి సెక్రటేరియట్‌, సభ్య దేశాలు కలిసి పని చేయాలని ప్రోత్సహించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img