Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రాజ్యాంగ పాలనకు విలువైన సూత్రాలు: చార్లెస్‌

లండన్‌: బ్రిటన్‌ చక్రవర్తి హోదాలో కింగ్‌ చార్లెస్‌ 111 సోమవారం పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘డార్లింగ్‌ దివంగత తల్లి’’ గురించి ప్రస్తావించారు. ‘రాజ్యాంగ పాలనకు సంబంధించిన విలువైన సూత్రాల అమలులో తల్లిని అనుసరిస్తానని ప్రతిజ్ఞ చేశారు. వెస్ట్‌మినిస్టర్‌ హాల్‌లో హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌, లార్డ్స్‌ సంతాపానికి ప్రతిస్పందిస్తూ సంతాపాలకు తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.
పార్లమెంటు మన ప్రజాస్వామ్యానికి సజీవమైన శ్వాస వంటిదని చార్లెస్‌ పేర్కొన్నారు. 73 ఏళ్ల చక్రవర్తి ఇప్పుడు కెమిల్లాతో కలిసి ఎడిన్‌బర్గ్‌కు వెళ్లి క్వీన్స్‌ శవపేటిక వెనుక ఊరేగింపులో పాల్గొన్నారు.
ప్రజల సందర్శనార్థం క్వీన్స్‌ భౌతికకాయాన్ని అక్కడ 24 గంటల పాటు ఉంచుతారు. చక్రవర్తిగా హోదాలో బాధ్యతలను చేపట్టడం ద్వారా, రాజ్యాంగ ప్రభుత్వాన్ని సమర్థించడంలో, ఈ దీవులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కామన్వెల్త్‌ రాజ్యాలు, భూభాగాల ప్రజల శాంతి, సామరస్యం, శ్రేయస్సు కోసం స్ఫూర్తిదాయకమైన ఉదాహరణను అనుసరించడానికి నేను కృషి చేస్తాను’ అని చార్లెస్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img