Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఉ.కొరియా హెయిల్‌`2 ప్రయోగం విజయవంతం

ప్యాంగ్యాంగ్‌: మానవరహిత అణ్వాయుధ జలాంతర్గామి ‘హెయిల్‌2’ను ది డెమొక్రటిక్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా (డీపీఆర్‌కే) విజయవంతంగా ప్రయోగించింది. నీటిలో వెయ్యి కిమీలకుపైగా ఈ సబ్‌మెరైన్‌ ప్రయాణించినట్లు కేసీఎన్‌ఏ వార్తాసంస్థ తెలిపింది. ఈనెల 47 తేదీల్లో 71 గంటల ఆరు నిమిషాల పాటు ఎలిప్టికల్‌ మార్గంలో తూర్పు కొరియా సముద్రంలో నీటిలోపల ప్రయాణించింది. డ్రోన్‌ ద్వారా అణ్వాయుధాన్ని నీటి లోపల పేల్చినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రయోగంతో తాజా అణ్వాయుధ శక్తిసామర్థ్యాలు రుజువైనట్లు కేసీఎన్‌ఏ పేర్కొంది. శక్తిమంతమైన హెయిల్‌`2తో డీపీఆర్‌కే సాయుధ దళాల సామర్థ్యం మరింత పెరుగుతుందని, ఎలాంటి శత్రువునైనా కట్టడి చేసేందుకు ఇది ఎంతగానో దోహదమవుతుందని వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img