Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఒలింపిక్స్‌లో క్యూబాకు 15 పతకాలు

టోక్యో : ఒలింపిక్స్‌లో క్యూబా 15 పతకాలు సాధించింది. 11 మిలియన్ల జనాభా కలిగిన అతిచిన్న సోషలిస్టు క్యూబా ఒలింపిక్స్‌లో 14వ స్థానంలో నిలిచింది. ఏడు స్వర్ణ పతకాలు, మూడు రజత పతకాలు, ఐదు కాంస్య పతకాలతో విజయకేతనం ఎగురవేసింది. వాస్తవానికి ఒలింపిక్స్‌లో క్యూబా గొప్ప ప్రదర్శన చేయడం ఇది మొదటిసారి కాదు..అనేక దశాబ్దాలుగా అమెరికా సాగిస్తున్న మారణహోమంతో ఆర్థిక, వాణిజ్య దిగ్బంధనానికి గురైనప్పటికీ ఒలింపియాడ్‌లో విజయం సాధించింది. 2004లో ఏథెన్స్‌లో క్యూబా 27 పతకాలతో 11వ స్థానంలో నిలిచింది. 2008 బీజింగ్‌లో 30 పతకాలు సాధించి 19వ స్థానంలో నిలిచింది. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో క్యూబా 15 పతకాలతో 16వ స్థానంలో నిలిచింది. సమ్మర్‌ ఒలింపిక్స్‌ గేమ్స్‌లో సాధించిన మొత్తం పతకాల ఆధారంగా, క్యూబా అమెరికా తరువాత అమెరికా ఖండంలో 241 పతకాలతో రెండవ స్థానంలో ఉంది. క్యూబా అత్యంత గొప్ప క్రీడా సంప్రదాయాన్ని కలిగిఉంది. తీవ్రమైన ఇబ్బందులను అధిగమించిన క్యూబా జెండా టోక్యోలో సగర్వంగా రెపరెపలాడిరది. క్యూబా అథ్లెట్లు గెలుచుకున్న 15 పతకాలు కాకుండా బంగారు పతక విజేత జూలియా సీజర్‌ లా క్రజ్‌ పంపిన సందేశం..‘మాతృభూమి లేదా మరణం…మేము గెలుస్తాం..సాధిస్తాం.’ ప్రపంచ ప్రజలకు స్పూర్తిగా నిలిచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img