Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

కొలంబియాలో మహిళల ఆందోళన

బొగొటా : కొలంబియా అధ్యక్షుడు డ్యూక్‌ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నెలరోజులుగా ఆ దేశంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో భాగంగా మహిళలపై లైంగిక హింస, వివక్షకు వ్యతిరేకంగా మహిళలు దేశ రాజధాని బొగొటాలో పెద్ద ఎత్తున ప్రదర్శన చేపట్టారు. భద్రతాదళాలు తమను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు 28 మంది మహిళలు ఫిర్యాదు చేశారని పౌర హక్కుల పరిరక్షణ కమిటీ వెల్లడిరచింది. మహిళలపై హింసాత్మక చర్యల ద్వారా వారిని భయపెట్టి నిరసనలు ఆపలేరని స్త్రీవాద సంస్థ డైరెక్టర్‌ లిండా స్పష్టం చేశారు. మహిళల్లో ప్రభుత్వం పట్ల నెలకొన్న తీవ్ర వ్యతిరేకతను అరికట్టేందుకు ప్రభుత్వం బలవంతంగా ప్రయత్నిస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 2017 నుంచి 2021 మధ్య కాలంలో ప్రభుత్వ భద్రతాదళాలు 132 మందిపై లైంగికదాడులకు పాల్పడినట్లు తాజా నివేదిక వెల్లడిరచింది.
నిరసనకారులపై కాల్పులు
కొలంబియాలోని యుస్‌మీ నగరంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులపై మొబైల్‌ పోలీసులు జరిపిన కాల్పులలో ఒకడు మృతి చెందాడు. 40 మందికి తీవ్రగాయాలయ్యాయి. 2021 ఏప్రిల్‌ 28 నుంచి ఇప్పటికి పోలీసు కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. వందలాది మందికి తీవ్రగాయాలయ్యాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img