Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

క్యూబాకు బ్రిటీష్‌ లేబర్‌ పార్టీ సంఫీుభావం

లండన్‌ : క్యూబాపై అమెరికా ఆంక్షలు కఠినతరం అవుతున్న నేపధ్యంలో క్యూబాకు సంఫీుభావం రెట్టింపు చేయాలని బ్రిటీష్‌ లేబర్‌ పార్టీ పిలుపునిచ్చింది. బ్రిటిష్‌ లేబర్‌ పార్టీ వార్షికోత్సవ మహాసభలో బ్రిటన్‌ లేబర్‌ పార్టీ సభ్యుడు గ్రాహమ్‌ మోరిస్‌ క్యూబా రాయబారి సమక్షంలో బ్రైటెన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సంఫీుభావం వెల్లడిరచారు. మేము అంతర్జాతీయవాదులం.. సంఫీుభావాన్ని విశ్వసిస్తామని తెలిపారు. క్యూబాపై అమెరికా దిగ్బంధనం, కోవిడ్‌`19 మహమ్మారి కాలంలో క్యూబా ప్రజల పరిస్థితి గురించి ప్రపంచానికి తెలియజేయడం గతంలో కంటే ఇప్పుడు మరింత ముఖ్యమని సూచించారు. అమెరికా క్యూబాపై విధించిన ఏకపక్ష చర్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. క్యూబాపై అమెరికా శత్రుత్వాన్ని సంఫీుభావంతో ఎదుర్కోవాలని అన్నారు. బ్రిటన్‌ పార్లమెంటేరియన్లు, సభ్యులు క్యూబన్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన యాంటీ కోవిడ్‌ వాక్సిన్ల ట్రయల్స్‌పై సహకారానికి క్యూబా రాయబారి కృతజ్ఞతలు తెలిపారు.
ఔకస్‌పై నిరసన
అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియాల మధ్య నూతన భద్రతా ఒప్పందం ఔకస్‌ను ప్రపంచ శాంతిని దెబ్బతీసే ప్రమాదకరమైన చర్యగా బ్రిటన్‌ ప్రధాన పతిపక్ష లేబర్‌ పార్టీ ప్రకటించింది. పార్టీ వార్షిక సమావేశంలో దీనికి సంబంధించిన తీర్మానాన్ని ప్రతి నిధులు ఆమోదించారు. ఔకస్‌ నూతన అణ్వాయుధ పోటీ ప్రచ్ఛన్న యుద్దాన్ని ప్రోత్సహిస్తోంది. మేము దానికి వ్యతిరేకమని కార్మిక నాయకుడు జెరిమీ కార్బిన్‌ ట్విట్టర్‌లో వెల్లడిరచారు. ఈ నెల ప్రారంభంలో ప్రకటించిన ఔకస్‌ ఒప్పందం విస్త్రత ఆందోళనలు, విమర్శలకు దారితీసింది. అణుశక్తితో నడిచే జలాంతర్గాములను, విమానాలను ఆస్ట్రేలియాకు అందించడం మొదటి చర్యగా మూడు దేశాలు ప్రకటించాయి. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) ఈ త్రైపాక్షిక ఒప్పందంపై ఆందోళన వ్యక్తం చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img