Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

మూడోసారి ప్రధానిగా ట్రుడో!

ఒట్టావా : కెనడా పార్లమెంటు ఎన్నికలు ఫలితాల్లో అధికార లిబరల్‌ పార్టీ పూర్తి మెజారిటీ సాధించడంలో వెనుకబడినా ఆ పార్టీయే అధికారాన్ని చేపట్టనుంది. జస్టిన్‌ ట్రుడో మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రతిపక్ష నాయకుడు ఎరిన్‌ ఒ టూలే తన ఓటమిని అంగీకరించారు. కెనడా పార్లమెంటు (హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌) లో మొత్తం 338 సీట్లు ఉండగా, విజయం సాధించాలంటే 170 సీట్లు సాధించవలసి ఉంది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల ప్రకారం అధికార పార్టీ 156సీట్లు గెలుచుకుంది.కన్సర్వేటివ్‌ పార్టీ 121 స్థానాల్లో ఆధిక్యతను నమోదుచేసింది. జగమీత్‌సింగ్‌ నేతృత్వంలోని న్యూ డెమొక్రటిక్‌పార్టీ 27సీట్లలో గెలిచింది. జగ్‌మీత్‌తోనే ట్రూడో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. అధికార లిబరల్‌ పార్టీ, ప్రతిపక్ష కన్సర్వేటివ్‌ పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మన దేశానికి చెందిన పంజాబ్‌ మూలాలున్న 17 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. కర్ణాటక మూలాలున్న చంద్రకాంత్‌ఆర్య నాపీస్‌ నుండి ఎన్నికయ్యారు. పంజాబీయేతర భారతీయ సంతతికి చెందిన ఏకైక ఎంపీ. మన దేశానికి చెందిన కెనడావాసులు ఈ ఎన్నికల్లో 49 మంది ఎన్నికల బరిలో నిలిచారు. 15మంది లిబరల్‌ పార్టీ నుంచి, 16మంది కన్సర్వేటివ్‌ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీలో నిలిచారు. కెనడాలో 2 కోట్ల 75లక్షల మంది ఓటర్లు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img