Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

సామ్రాజ్యవాద దోపిడీని ఖండిరచిన కేకేఈ

బెలారస్‌ : పోలాండ్‌బెలారస్‌ సరిహద్దుల్లో శరణార్థుల సంక్షోభంపై కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ గ్రీస్‌(కేకేఈ) ఆందోళన వెలిబుచ్చింది. సామ్రాజ్యవాద నిరంకుశ విధానాలకు, యుద్ధాలకు బలైౖన ప్రజలకు కేకేఈ సంఫీుభావం ప్రకటిచింది. పోలాండ్‌, బెలారస్‌ ప్రజలతోపాటు ఈ ప్రాంతంలోని ఇతర ప్రజలు జాత్యహంకారం, జాతీయవాదంపై పోరాడాలని కేకేఈ పిలుపునిచ్చింది. బెలారస్‌ సరిహద్దుల్లో వేలాదిమంది శరణార్థులు, వలసదారులు ఎదుర్కొంటున్న తాజా పరిణామాలు యుఎస్‌Ñ ఈయూ, నాటో దేశాల నేతృత్వంలోని సామ్రాజ్యవాద జోక్యాలను కేకేఈ ఖండిరచింది. లక్షలాది మంది ప్రజల అక్రమరవాణాను అరికట్టాలను పేర్కొంది. ఈయూ, బెలారస్‌ల మధ్య ఒప్పందం అమలు, బెలారస్‌ ప్రస్తుత నాయకత్వాన్ని పడగొట్టేందుకు యూరోఅట్లాంటిక్‌ సామ్రాజ్యవాద ప్రయత్నాలను, వలసదారుల సమస్యను పరిష్కరించాలని కేకేఈ డిమాండ్‌ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img