Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఇరాన్‌, టర్కీ మధ్య సహకార ఒప్పందం

టెహ్రాన్‌ : ఇరాన్‌, టర్కీ ‘సహకార ప్రణాళికను రూపొందించేందుకు` అభివృద్దికి అంగీకరించాయి. ఇరాన్‌ విదేశాంగ మంత్రి హుస్సేన్‌ అమీర్‌ అబ్దుల్లాహన్‌, ఇరాన్‌ పర్యటనలో ఉన్న టర్కీ విదేశాంగమంత్రి మెవ్‌లుట్‌ రాజధాని టెహ్రాన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, టర్కీ, ఇరాన్‌ల మధ్య దీర్ఘకాలిక సహకారం కోసం నూతన అధ్యాయాన్ని రూపొందించేందుకు రెండు పక్షాలు అంగీకారం తెలిపాయని పేర్కొన్నారు. ఇరాన్‌, టర్కీల మధ్య సంబంధాలను స్నేహపూర్వకంగా, చారిత్రాత్మకంగా నిజాయితీగా ఉండాలని ఆశిస్తున్నట్లు టర్కీ అధ్యక్షడు ఎర్డోగాన్‌ పేర్కొన్నారు. ఉమ్మడి యంత్రాంగాలను అభివృద్ధి చేయడం ద్వారా ఇరు దేశాల మధ్య ప్రస్తుతం ఉన్న వాణిజ్య అడ్డంకులు త్వరగా తొలగిపోతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రవాణా, ట్రాఫిక్‌, కాన్సులర్‌ సమస్యలను సులభతరం చేయడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నా ఆయన పేర్కొన్నారు. మహమ్మారి పరిస్థితులలో ఇరాన్‌, టర్కీల వాణిజ్య సంబంధాలు కొంతవరకు ప్రభావితమయ్యాయి, అయినప్పటికీ, రెండు దేశాలు ఈ సంబంధాల కొనసాగింపును నిర్వహించగలిగాయని ఇరాన్‌ సీనియర్‌ అధికారి తెలిపారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ నుండి ఇరాన్‌ ద్వారా టర్కీకి వాణిజ్య మార్గాన్ని తెరవడానికి త్రైపాక్షిక సహకారం గురించి అడిగినప్పుడు, అమీర్‌ అబ్దుల్లాహియాన్‌ ‘‘మేము ఈ ప్రాంతంలో ఉన్న సామర్థ్యాలను బట్టి త్రైపాక్షిక, బహుపాక్షిక సహకారాన్ని పరిశీలిస్తున్నాము’’ అని అన్నారు.ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై ప్రతిస్పందిస్తూ ప్రాంతీయ సమస్యలపై ఇరాన్‌, టర్కీల మధ్య ఏకాభిప్రాయం ఉందని పేర్కొన్నారు. యెమెన్‌లోని సంక్షోభంపై ప్రస్తావిస్తూ, అరబ్‌లో అంతర్యుద్ధం వీలైనంత త్వరగా ముగుస్తుందని, ఇరాన్‌ విదేశాంగ మంత్రి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇరాక్‌ ప్రధానిపై ఇటీవల జరిగిన ఉగ్రవాద చర్యను ఇరాన్‌, టర్కీ ఖండిస్తున్నాయని, కొత్త పార్లమెంటు ఏర్పాటుతో ఇరాక్‌లో స్థిరత్వం పునరుద్ధరిస్తుందని అమీర్‌ అబ్దుల్లాహియాన్‌ అన్నారు. టర్కీ ఎప్పుడూ ఇరాన్‌కు సోదరుడేనని, ఎలాంటి సేవలు అందించడానికైనా సిద్ధంగా ఉందని టర్కీ విదేశాంగ మంత్రి మెవ్‌లుట్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img