Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

సామ్రాజ్యవాదుల వినాశకర పాత్ర

కాబూల్‌ : అఫ్గానిస్తాన్‌లో నెలకొన్న ప్రస్తుతం సంక్షోభాన్ని కమ్యూనిస్టు, వర్కర్స్‌ పార్టీలు తీవ్రంగా ఖండిరచాయి. యుఎస్‌` ఈయూ సామ్రాజ్యవాద దేశాల వినాశకరమైన పాత్ర, 2001 నుంచి అఫ్గాన్‌లో సైనిక జోక్యం, 1980లో తాలిబన్ల ఎదుగుదలకు మద్దతు పలికిన యూరోపియన్‌ ప్రభుత్వాలు, అమెరికా నిరంకుశ వైఖరిని కమ్యూనిస్టు దేశాలు ఖండిరచాయి. దీనిపై వివిధ దేశాలు ప్రత్యేక ప్రకటన విడుదల చేశాయి.
పోర్చుగీసు కమ్యూనిస్టు పార్టీ (పీసీపీ)
అఫ్గానిస్తాన్‌లో ఇటీవలి పరిణామాలపై పీసీపీ ఖండిరచింది. యుఎస్‌, నాటో కూటమి ఆక్రమణ వ్యూహంలో పాలుపంచుకున్నవారందరికీ అవమాన కరమైన ఓటమిగా పీసీపీ పేర్కొంది. 20 సంవత్సరాలుగా అమెరికా, ఈయూ దేశాల ఆక్రమణ, లక్షలాది మరణాలు, విధ్యంసం, నిర్వాసితులు, శరణార్థు లకు బూర్జువా విధానాలే కారణమని పేర్కొంది. అవినీతి ద్వారా అణగదొక్కబడిన పాలనను స్థాపించడం ద్వారా అఫ్గాన్‌ ప్రపంచంలో అతిపెద్ద నల్లమందు ఉత్పత్తికేంద్రంగా తయారైందని పేర్కొంది.
కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ బ్రిటన్‌
అఫ్గాన్‌లో జరిగిన పరిణామాలు, విషాద ఘటనలను బ్రిటన్‌, యుఎస్‌, కమ్యూనిస్టులు పార్టీలు ఖండిరచాయి. సామ్రాజ్యవాద జోక్యం, మానవతా వాదానికి వ్యతిరేక చర్యలే ఈ ఘాతుకానికి కారణమని బ్రిటన్‌ కమ్యూనిస్టు పార్టీ నేత స్టీవ్‌ జాన్సన్‌ పేర్కొన్నారు. కమ్యూనిస్టు పార్టీ రాజకీయ కమిటీ ఆప్గాన్‌లో ఉన్న ప్రజలకు ఆశ్రయం కల్పించాలని బ్రిటీష్‌ ప్రభుత్వాన్ని కోరింది.తాలిబన్లకు ధీటుగా ప్రజాస్వామ్య, మానవహక్కులను రక్షించేందుకు మహిళలకు సంఫీుభావంగా నిలబడాలని కార్మిక, ప్రగతిశీల ఉద్యమకారులను సీపీ కోరింది.
పాకిస్తాన్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ
అప్గాన్‌లో తాలిబన్ల దురాక్రమణ, యుఎస్‌ సామ్రాజ్యావాదాన్ని పాకిస్తాన్‌ కమ్యూనిస్టు పార్టీ ఖండిరచింది. అఫ్గాన్‌ పౌరుల హక్కులు, మహిళలు, పిల్లల హక్కులు కాపాడేందుకు బలమైన పోరాట శక్తి ఏర్పాటుకు పాకిస్తాన్‌లోని ప్రగతిశీల శక్తులు, పార్టీలు ఏకంకావాలని విజ్ఞప్తి చేసింది. అఫ్గాన్‌లో స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేవరకు తాలిబన్ల పాలనను గుర్తించవద్దని ప్రపంచంలోని అన్ని సోదర కమ్యూనిస్టులు, కార్మికుల పార్టీకి పాకిస్తాన్‌ కమ్యూనిస్టు పార్టీ సూచించింది.
బంగ్లాదేశ్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ(సీపీబీ)
బంగ్లాదేశ్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ (సీపీబీ) ఆప్గాన్‌్‌లో తాలిబాన్‌లు అధికారాన్ని స్వాధీనం చేసుకున్న ‘నాటకీయ’, ప్రమాదకరమైన సంఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా ఆక్రమణ తరువాత, ఆఫ్గాన్‌ ప్రజలు ఇప్పుడు హింసాత్మక మతోన్మాద మిలిటెంట్‌ తాలిబాన్‌ చీకటి పాలనను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img