Friday, April 26, 2024
Friday, April 26, 2024

శ్రీ చైతన్యలో ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

విశాలాంధ్ర -రాజంపేట: పట్టణ కేంద్రంలోని ఆర్ఎస్ రోడ్డులో ఉన్నటువంటి శ్రీ చైతన్య పాఠశాలలో గురువారం ఏజీఎం రమణయ్య, ప్రిన్సిపల్ ఆకేపాటి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. దేశంలోని అతిపెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగం అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని లిఖించి దేశ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. అనంతరం దేశభక్తి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులను అభినందించి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ అనూష, డీన్ వెంకటసుబ్బయ్య, సి బ్యాచ్ ఇంచార్జ్ శ్రీనివాసులు, ప్రైమరీ ఇంచార్జ్ కస్తూరి, ఉపాధ్యాయులు వెంకటేష్, వెంకటసుబ్బయ్య, సుప్రియ, మధుప్రియ, నాగలక్ష్మి, ప్రసన్న, రూప, ప్రతిభా భారతి, అనిత, సుజాత, షకీన, శ్రీదేవి, వ్యాయామ ఉపాధ్యాయులు చంద్రశేఖర్, షాబు, మురళీమోహన్ రెడ్డి, రవి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img