Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

ఛలో కుప్పం మహాసభలను జయప్రదం చేయాలి

మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు

విశాలాంధ్ర -రాజంపేట: ఈనెల 14వ తేదీన నిర్వహించే చలో కుప్పం మహాసభలను జయప్రదం చేయాలని మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు లింగం సంజీవ్ పిలుపునిచ్చారు. మంగళవారం బోయినపల్లి మాల మహానాడు కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు యామల సుదర్శన ఆదేశాల మేరకు 14 వ తేదీన ” హలో మాల చలో కుప్పం” మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు లింగం సంజీవ్ ఆధ్వర్యంలో హలో మాల చలో కుప్పం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లింగం సంజీవ్ మాట్లాడుతూ మాలలంతా ఏకమై ఎస్సీ వర్గీకరణను అడ్డుకొని రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాలమహానాడు రాజంపేట నియోజకవర్గ అధ్యక్షులు ఇరువూరి శివయ్య, రాజంపేట మండల అధ్యక్షులు అక్కి బాలగంగాధర్, నందలూరు మండల అధ్యక్షులు ఇరువూరి మురళి, రాజంపేట ప్రధాన కార్యదర్శి చౌడవరం నరసింహులు, రాజంపేట ఉపాధ్యక్షులు కోటపాటి రవీంద్ర, గౌరవ అధ్యక్షులు సుబ్బయ్య, శ్రీను, చంద్రశేఖర్, నరసింహులు మరియు రాజంపేట, రైల్వే కోడూరు మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img