Thursday, September 29, 2022
Thursday, September 29, 2022

మహా తిరంగా జండా ర్యాలీని విజయవంతం చేయాలి

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలి
రాజంపేట ఆర్డిఓ కోదండరామిరెడ్డి

విశాలాంధ్ర -రాజంపేట: ఆజాది కా అమృత మహోత్సవంలో భాగంగా ఈనెల 13వ తేదీ శనివారం రాజంపేటలో జరిగే 75వ స్వాతంత్ర దినోత్సవ మహా తిరంగా జండా మహా ర్యాలీని నగర ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆర్డిఓ కోదండరామిరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఆర్డిఓ సభ భవనంలో ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆజాది కా అమృత మహోత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే 13వ తేదీన రాజంపేట పట్టణమంతా మూడు రంగుల జాతీయ జెండా శోభితం కావాలన్నారు. వార్డు కౌన్సిలర్లు, వాలంటీర్ల ద్వారా మూడు లక్షల జాతీయ జెండాలను ప్రతి ఇంటికి పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుందన్నారు. అన్నమాచార్య ఇంజనీరింగ్ టెక్నాలజీ కాలేజీ వారిచే మూడు భారీ బెలూన్లు ఎగురవేత తో పాటు టపాసులు సరాలు క్రాకర్స్, షాట్స్ ప్రదర్శనలు హిందూ, ముస్లిం, క్రైస్తవ మతపెద్దలు జాతీయ సమైక్యతకు సహకరించాలి అన్నారు. ప్రైవేట్ ప్రభత్వ విద్యాసంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.రాజంపేట జూనియర్ కాలేజీ నుండి ఆర్ అండ్ బి వరకు జరిగే ర్యాలీలో 100 మీటర్ల జెండా ప్రదర్శన డ్రస్ కోడ్ లో ఆయాశాఖల ఉద్యోగులు అనుసరించాలి అన్నారు. విధిగా తెలుపు రంగు దుస్తులలో డ్రస్ కోడ్ లేని ఉద్యోగులు నిరుద్యోగులు విద్యార్థులు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ శాఖల అధికారులు ర్యాలీలో పాల్గొనాలి అన్నారు. 13 నుండి 15 వరకు మూడు రోజులపాటు విద్యుత్ ద్దీపాలంకరణలు కొనసాగించడం జరుగుతుందన్నారు.
జాతీయ నేతలు, స్వాత్రంత్ర్య సమర యోధుల చిత్రాలతో ఫెక్సీలు, భారీ బ్యానర్లు.
వివిధ శాఖల అధికార్లకు సమాన బాధ్యతలను కొన్ని శాఖలకు అప్పగించారు. మధ్యాహ్నం 12 గంటలు జాతీయగీతాలాపన చేసే సమయంలో ఆర్టీసీ బస్సులతో సహా ప్రతి పౌరుడు ఏ పరిస్థితిలో ఉన్నను చలనరహితుడై నిశ్చల స్థితిలో నిలబడి జండా వందనం చేయాలన్నారు.డీజే మైక్ సౌండ్లతో సాంస్కృతిక ప్రదర్శనలు, దేశభక్తి గీతాలు, నృత్యాలు, విద్యార్థులచే దేశనాయకులు స్వాత్రంత్ర్య ఉద్యమనేతల వేషధారణలు ఏర్పాటై కానున్నాయని,మహా ర్యాలీలో జిల్లా కలెక్ట్రర్, జిల్లా ఎస్పీ, స్థానిక ప్రతినిధులతో పాటు ఎమ్మెల్యే, జడ్పి చైర్మన్, ఎంపీ, ఉపముఖ్యమంత్రి ప్రముఖులు పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. కావున పట్టణ ప్రజలంతా ఈ మహా ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి, ఏవో శిరీష, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img