Wednesday, February 8, 2023
Wednesday, February 8, 2023

మాండూస్ తుఫాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

తాసిల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి

విశాలాంధ్ర -రాజంపేట: మాండూస్ తుఫాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాసిల్దార్ ఎం. సుబ్రహ్మణ్యం రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన విశాలాంధ్రతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ పిఎస్ గిరిష ఆదేశాల మేరకు రానున్న భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ప్రమాదాల జరగకుండా, ప్రజలకు అందుబాటులో ఉండేందుకు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లాలన్నారు. చెరువులు, వాగులు, వద్దకు పిల్లల్ని పంపకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు అందరూ అందుబాటులో ఉంటారన్నారు. రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లాలని తెలియజేశారు. ప్రజలు ఏదైనా సమాచారం పంపాలి అనుకుంటే ఈ క్రింది ఫోన్ నెంబర్ 9959667588 కు మెసేజ్ ద్వారా కానీ ఫోన్ ద్వారా గాని తెలియజేయాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img