Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది

  • సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పిలుపు
  • సిపిఐ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

భారతదేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైనదని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ భారతీయులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం తిరుపతిలోని సిపిఐ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యోద్యమ పోరాటంలో వేలాది మంది భారత కమ్యూనిస్టు పార్టీకి చెందిన నాయకులు నేలకొరిగారని, అనేక మంది తుపాకి గుండ్లకు బలయ్యారని తెలిపారు. రక్త తర్పణం ద్వారా వచ్చిన స్వాతంత్రానికి 75 సంవత్సరాలు నిండాయని వివరించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కానీ ఆ రాజ్యాంగానికి నేడు ప్రమాదం వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం విదేశీ కుట్రదారుల వలనో….. స్వదేశీ ప్రతిపక్షాలు, తీవ్రవాదుల వలనో…. కాదని స్వయంగా మనం ఎంపిక చేసుకున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ వల్లేనని ఆయన ఆరోపించారు. మొత్తం వ్యవస్థలను నాశనం చేసుకుంటూ వస్తున్నారని విమర్శించారు. రాష్ట్రపతి, ఎలక్షన్ కమిషన్, ఆర్బిఐ సిబిఐ తదితర వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టుకోవడమే కాకుండా న్యాయ వ్యవస్థను కూడా తన వశం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని, ఆగస్టు తర్వాత పూర్తిగా తన కనుసన్నుల్లోనే ఈ వ్యవస్థను పనిచేయనున్నదని తెలిపారు. రాజ్యాంగాన్ని మార్చే క్రమంలో వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారని, ‘సెక్యులర్’ అనే పదాన్ని తీసివేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని మంటగలిపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. లౌకిక వ్యవస్థలను దెబ్బ కొట్టిన తర్వాత దేశం ఒకటిగా ఉండటం సాధ్యం కాదని వివరించారు. దేహం ముక్కలైనా…. దేశాన్ని ముక్కలు కానివ్వమని ఆయన నొక్కి ఒక్కానించారు. రాజ్యాంగానికి ప్రమాదం వచ్చిందని రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకిక వ్యవస్థను కాపాడుకుందామని తద్వారా స్వాతంత్ర పోరాటానికి న్యాయం చేద్దామని యువతకు పిలుపు నిచ్చారు. భారతదేశంలో కోట్లాది మంది చేనేత కార్మికులు ఉన్నారని, ఇక్కడ తయారు చేయాల్సిన జాతీయ జెండాను చైనాకు అప్పగించి వేల కోట్లను గుమ్మరించాని ఆరోపించారు. జాతీయ జెండాను తయారుచేసే ఆకాశం భారతీయ చేనేత కార్మికులకు ఇచ్చి ఉంటే తక్కువ ధరకే నాణ్యమైన జెండాలను అందించే వారని, వారి కుటుంబాలకు కూడా ఆర్థిక సహకారం లభించేదని తెలిపారు. జాతీయ జెండాలను మార్కెట్లో అమ్మకానికి పెట్టడం దౌర్భాగ్యమని ఆవేదన చెందారు. జాతీయ జెండాను కూడా కార్పొరేట్ మయం చేసే ప్రమాదం వచ్చేసిందన్నారు. ఈ నేపథ్యంలో రాజ్యాన్ని కాపాడుకోవడానికి భారత దేశంలోని ప్రతి ఒక్కరు నడం బిగించాలని, ఇందుకు కమ్యూనిస్టు పార్టీ అండగా ఉంటుందని నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు రామానాయుడు, జిల్లా కార్యదర్శి మురళి, కార్యవర్గ సభ్యులు పెంచలయ్య, రామచంద్రయ్య, విశ్వనాథ్, గురవయ్య, పార్థసారథి, ప్రభాకర్, సుధాకర్ రెడ్డి, నదియా వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img