Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

బాలుర హాస్టల్లో మౌలిక వసతులు కల్పించాలి

ఏఐవైఎఫ్

విశాలాంధ్ర- ఎన్టీఆర్ జిల్లా : నందిగామ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ గురువారం స్పందన కార్యక్రమంలో ఎమ్మార్వో నరసింహారావుకు, సంబంధిత అధికారులకు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ నందిగామ పట్టణ పరిధిలోని జిల్లా పరిషత్ ఆవరణలో ఉన్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని గదులలో పై పెచ్చులు ఊడి కింద పడుతున్నాయని కొన్ని గదులలో కింద నాపరాల్లు పగిలి విష జంతువులు చేరుతున్నాయని విద్యార్థులు భయాందోళన చెందుతున్నారని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు లంక గోవిందరాజులు తెలిపారు.ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నందిగామ పట్టణంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడారు . మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు తెలియజేశారని ప్రభుత్వ బాలుర వసతి గృహంలో 70 మందికి పైన విద్యార్థులు ఉన్నారని ఐదవ తరగతి నుండి ఇంటర్ వరకు జరుగుతున్నటువంటి విద్యార్థులు ఈ హాస్టల్లో వసతి పొందుతున్నారని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.విద్యార్థులు తెలిపిన పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నందిగామ ఆర్డీవో కార్యాలయంలో ఏవో నరసింహారావు కి అదేవిధంగా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి కి వినతి పత్రం అందజేశారు. స్పందించిన అధికారులు తక్షణమే నాడు నేడు ద్వారా వసతి గృహంలో సదుపాయాలు మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి మన్నే హనుమంతరావు,వర్కింగ్ ప్రెసిడెంట్ మౌలాలి,కమిటీ సభ్యులు వై నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img