Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాలి పోస్టులు భర్తీ చేయాలి

ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు లంకా గోవిందా గోవింద రాజులు డిమాండ్

ఎన్టీఆర్ జిల్లా – నందిగామ : రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా అధ్యక్షులు లంకా గోవింద రాజులు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక రైతు పేట సి ఆర్ భవన్ లోకార్యాలయం నందు ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.35 లక్షల పోస్టుల భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఎన్ని ఖాళీ పోస్టులు ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని అన్నారు.ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నేను ఉన్నాను నేను విన్నాను అధికారంలోకి రాగానే ప్రభుత్వ శాఖల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తాను ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి నిరుద్యోగ యువతరం మోసం చేశారని జాబ్ క్యాలెండర్ పేపర్లకే పరిమితమైన తప్ప ఆచరణలో ఏ విధమైనటువంటి ఉద్యోగాలు భర్తీ జరగలేదని డీఎస్సీ విషయంలో నిరుద్యోగ యువతరం మోసం చేసారనిఅన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 50,667 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎస్జిటిలతో అదనపు తరగతులు నిర్వహిస్తూ డీఎస్సీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం చేయడంతో పాటు జాతీయ విద్యా విధానం పేరుతో అనేక ప్రభుత్వ పాఠశాలలను విలీనం చేసి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం లేదంటూ ప్రభుత్వం పెద్దలు మంత్రులు వెల్లడించడం సరికాదని నిరుద్యోగ యువత వేలాది రూపాయల ఖర్చు పెట్టుకుని డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తుందని డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేయాలని, రాష్ట్ర వ్యాపితంగా అనేక ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ముఖ్యంగా విద్య,వైద్య, ఆర్ధిక శాఖలో ఖాళీ పోస్టుల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి మన్నే హనుమంతు రావు (అంజి) ఏఐవై ఎఫ్ నాయకులు టి.గోపి,సిహెచ్.గోపి,సిలారు,శ్రీహరి,అరుణ్, శాహిద్ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img