Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఎమ్మెల్యే అనుచరుడు బలరాంను కఠినంగా శిక్షించాలి : ఏపీయూడబ్ల్యూజే

విశాలాంధ్ర – ఆస్పరి : కోడుమూరు విలేకరిపై దాడి చేసిన అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరుడు బలరాంను కఠినంగా శిక్షించాలని ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సభ్యులు నాగన్న ఏపీయూడబ్ల్యూజే మండల అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసులు, మురళిలు డిమాండ్ చేశారు శుక్రవారం స్థానిక తహసిల్దార్ కార్యాలయం ముందు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో మండల పాత్రికేయులు, ప్రజాసంఘాల నాయకులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోడుమూరులో ఇసుక దందాపై వార్త రాసిన విశాలాంధ్ర విలేఖరి సతీష్ పై అధికార పార్టీ నాయకుడు ఎమ్మెల్యే సుధాకర్ అనుచరుడు బలరాం దాడి చేసి గాయపరచడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జర్నలిస్టుపై దాడి చేసిన బలరాంను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ కుమారస్వామి కి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు, పాత్రికేయులు, డానియల్, వెంకటేష్, రూబిన్, లక్ష్మన్న, సిపిఐ పట్టణ కార్యదర్శి కృష్ణమూర్తి, సీనియర్ నాయకులు బ్రహ్మయ్య, ఉరుకుందప్ప, రామాంజిని పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img