Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఘనంగా పండిత గానాల రామ్మూర్తి జయంతి వేడుకలు

విశాలాంధ్ర-పెద్దకడబూరు : మండల కేంద్రమైన పెద్దకడబూరులో శ్రీ శ్రీ వేదమాత విశ్వకర్మ విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శనివారం రాహు సాహెబ్ పండిత గానాల రామ్మూర్తి 131 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ నరసింహ ఆచారి గానాల రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ పండిత గానాల రామ్మూర్తి బ్రిటిష్ పరిపాలనలో ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఓసిగా ఉన్న విశ్వబ్రాహ్మణులను బీసీలోకి మార్చడానికి చట్టసభల్లో అహర్నిశలు కృషి చేశారని గుర్తు చేశారు. విశ్వబ్రాహ్మణులను బీసీలుగా చర్చి విశ్వబ్రాహ్మణ జాతికి పేరు ప్రఖ్యాతలు తెచ్చారన్నారు. విశ్వబ్రాహ్మణులకు అన్ని విధాలుగా కృషి చేసిన స్వర్గీయ రాహు సాహెబ్ పండిత గానాల రామ్మూర్తికి విశ్వబ్రాహ్మణ జాతి ఎంతో రుణపడి ఉంటుందన్నారు. ఈ జయంతి వేడుకల్లో విశ్వబ్రాహ్మణులు కేశవాచారి, కంసాలి బ్రహ్మయ్య ఆచారి, కమ్మర పరమేషాచారి, వీరనాచారి, పెద్ద రంగస్వామి ఆచారి, తిరుమల ఆచారి, శరవయ్య ఆచారి, పద్మనాభా చారి, కంసాలి మాలింగప్ప ఆచారి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img