Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

విశాలాంధ్ర ..ఆస్పరి : మండల పరిధిలోనే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కార్యాలయాలలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ కుమారస్వామి, పోలీస్ స్టేషన్లో ఎస్సై వరప్రసాద్, మండల పరిషత్ కార్యాలయంలో ఇన్చార్జి ఎంపీడీవో రాధ, సొసైటీ కార్యాలయంలో చైర్మన్ కట్టెల గోవర్ధన్, సచివాలయ కేంద్రంలో పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ, వ్యవసాయ కార్యాలయంలో ఏవో మునెమ్మ, జడ్పీ హైస్కూల్లో విద్యా కమిటీ చైర్మన్ కట్టెల గోవర్ధన్, ప్రభుత్వ ఆస్పత్రిలో డా. మోహినుద్దీన్ ఫీరా, పశువైద్యశాలలో డాక్టర్ పనేంద్ర కుమార్, స్త్రీ శక్తి భవనంలో మండల సమైక్య అధ్యక్షురాలు కట్టెల భాగ్యలక్ష్మి, సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్ జగదీష్ వర్మ, ఆయా కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సచివాలయ 1డ2 ఉద్యోగులు సర్పంచ్ మూలింటి రాధమ్మ ఆధ్వర్యంలో స్థానిక చౌరస్తా లోనే అంబేద్కర్ విగ్రహానికి జలాభిషేకం నిర్వహించి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే ఎమ్మార్పీఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తులు మాట్లాడుతూ 1950 జనవరి 26న భారతదేశం రిపబ్లిక్ గా అవతరించిందన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు చేసిన త్యాగాలను స్మరించుకొని నివాళులర్పించుకోవాలన్నారు. మనం అనుభవిస్తున్న స్వేచ్చ, స్వాతంత్య్రములు ఎందరో సమరయోధుల ఆత్మార్పణ ఫలమన్నారు. ఈ స్వేచ్చ, స్వాతంత్రాలు ఉపయోగించుకుని ప్రజలందరూ, శాంతి, సౌబ్రాతృత్వాలుతో జీవిస్తూ, దేశ అభివృద్ధికి పాటుపడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కేడీసీసీ డైరెక్టర్ మూలింటి రాఘవేంద్ర, మాజీ కన్వీనర్ రామాంజనేయులు, సొసైటీ సీఈఓ అశోక్ నాయుడు, తిమ్మప్ప, ప్రకాష్, ఆలీ, ప్రధానోపాధ్యాయురాలు సుజాత, ఎమ్మార్పీఎస్ నాయకులు నెట్టేకల్లు, వసంత, ఎల్లప్ప, సచివాలయ ఉద్యోగులు, గ్రామ వాలంటరీలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img