Friday, April 26, 2024
Friday, April 26, 2024

తెలుగు సినీ పరిశ్రమ ఓ దిగ్గజాన్ని కోల్పోయింది

విశాలాంధ్ర.. నందికొట్కూరు : తెలుగు సినీ పరిశ్రమ ఓ దిగ్గజాన్ని కోల్పోయిందని నందికొట్కూరు కృష్ణ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు శ్రీ రామ టాకీస్‌ యజమాని రామిరెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని థియేటర్‌ ఆవరణంలో సూపర్‌ స్టార్‌ కృష్ణ ఫోటోకు పూలదండలు వేసి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్‌ స్టార్‌ కృష్ణ అంటేనే మంచితనానికి మానవత్వానికి నిలువు దట్టమన్నారు. గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రుపాలెం గ్రామంలో 1942 మే 31న ఘట్టమనేని వీర రాఘవయ్య చౌదరి, నాగరత్నమలకు పెద్దకొడుకుగా జన్మించిన ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి సూపర్‌ స్టార్‌ కృష్ణ గా మారడానికి చేసిన కృషి అంతా ఇంతా కృషి కాదన్నారు. నటుడు, దర్శకుడు, నిర్మాత, పద్మాలయ స్టూడియో అధినేతగా తెలుగు సినీ కళామతల్లికి ఆయన అందించిన సేవలు మరపురానివని కొనియాడారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img