Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

పశ్చిమ రాయలసీమలో వలసలు నివారణకు ఉద్యమించాలి

విశాలాంధ్ర- పెద్దకడబూరు : పశ్చిమ రాయలసీమలో కరువు, వలసలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉద్యమించాలని ఆర్ సి సి పొలిటికల్ ఆర్గనైజర్ రాజన్న పిలుపునిచ్చారు. అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో చేపట్టిన రాయలసీమ వలస కార్మికుల చైతన్య యాత్ర మంగళవారం పెద్దకడబూరు మండలానికి చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల పరిస్థితి రోజు రోజుకు దిగజారి పోతుందన్నారు. ఇప్పటికీ మన ప్రాంతంలో కరువు, వలసలు ఉన్నాయని, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం అందరం కలిసి ఉద్యమించాలన్నారు. దేశంలో కార్పోరేట్ వ్యవస్థ పెరిగి పోతుందని, దీని వల్ల కూడా రైతులకు ధరలలో హెచ్చు తగ్గులు ఉండడం వల్ల రైతులు నష్టపోయి ఆత్మహత్యలు పెరిగి పోతున్నాయి అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా తాగునీటి కోసం ప్రతిరోజు ఎదురుచూడడం దేనికి సంకేతం అన్నారు. ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరని ఆదిశగా ప్రజల్ని చైతన్యవంతం చేసేందుకే ఈ యాత్ర చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ సి సి నాయకులు రవివర్మ, శాంతిరాజు,పీఓ డబ్ల్యూ స్త్రీ విముక్తి నాయకులు సుజ్ఞానమ్మ, మణిరత్న, ఏఐఎఫ్ టి యు నాయకులు గంగన్న, హుస్సేన్, భాష తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img