Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రైతుల పాదయాత్రను జయప్రదం చేయండి

ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిమ్మయ్య
విశాలాంధ్ర`ఆలూరు : అధిక వర్షాలు, నకిలీ పత్తి విత్తనాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని రైతుల బ్యాంకు రుణాలు రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ రైతు సంఘం సిపిఐ ఏఐకేఎస్‌ ల ఆధ్వర్యంలో డిసెంబర్‌ 16 నుండి 20 తేది వరకు రైతు రక్షణకై చేపట్టిన కాలినడక యాత్రను జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిమ్మయ్య, సిపిఐ మండల కార్యదర్శి రామాంజనేయులు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో మండల ముఖ్య నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 16వ తేదీన ఆదోని నుండి రైతు పాదయాత్ర ఆస్పరి మీదుగా కర్నూలుకు కొనసాగుతుందన్నారు. అధిక వర్షాలకు నష్టపోయినటువంటి రైతులకు ఎకరాకు 50 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 20వ తేదీన కర్నూలు కలెక్టరేట్‌ ముందు నిర్వహించే మహా ధర్నా కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ హాజరవుతున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి హోతురప్ప, ఏఐటీయూసీ తాలూకా అధ్యక్షులు శివ, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img