Friday, April 26, 2024
Friday, April 26, 2024

మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం..

ఉతాగునీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు సిద్ధం
ఉమంత్రి గుమ్మనూరు జయరాం
వైయస్సార్ ఆసరా మెగా చెక్కు పంపిణీ

విశాలాంధ్ర -ఆస్పరి : మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. సోమవారం మండల కేంద్రంలో జరిగిన వైఎ్‌సఆర్‌ ఆసరా మూడవ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి జయరాం, సోదరుడు గుమ్మనూరు నారాయణస్వామి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా సభా ప్రాంగణంలో పొదుపు మహిళలతో కలిసి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి జయరాం మాట్లాడుతూ మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని, అక్క చెల్లెమ్మల ఆర్థికాభివృద్ధికి గాను ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ. 2,25,33,763 లక్షల కోట్ల నగదు జమ చేసిందన్నారు. ఆలూరు నియోజకవర్గం 6 మండలాల్లో 2,708 స్వయం సహాయక పొదుపు సంఘాలకు దాదాపుగా రూ. 13 కోట్ల మేర అక్క చెల్లెమ్మల బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. మండలంలో 384 మహిళా గ్రూపులలో ఉన్న 3,946 మంది సభ్యులకు మూడవ విడత కోటి 58 ల్లక్షల 64 వేల రూపాయలు ఆసరా పథకం ద్వారా సాయం అందిస్తున్నట్లు తెలిపారు. మహిళల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాల ప్రయోజనాలను సద్వినియోగపరచుకోవాలని మంత్రి సూచించారు. ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న ప్రతి సంక్షేమపథకం నేరుగా లబ్ధిదారులకు అందజేసే ప్రక్రియ రాష్ట్రంలో కొనసాగుతున్నట్లు తెలిపారు. గ్రామాల్లో నీటి ఎద్దడి ఉందని కొంతమంది పొదుపు మహిళలు మంత్రి దృష్టికి తీసుకుని రాగా సానుకూలంగా స్పందించి జొహరాపురం గ్రామంలో 30 ఎకరాలలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ను ఏర్పాటు చేసి మండలంలో నీటి ఎద్దడి తలెత్తుకుండా త్వరలో పనులు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించామన్నారు. ఈ కార్యక్రమంలో డి.అర్.డి.ఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్, తాసిల్దార్ కుమారస్వామి, జిల్లా సహకార బ్యాంకు డైరెక్టర్ రాఘవేంద్ర, జడ్పిటిసి దొరబాబు, ఎంపీపీ సుంకర ఉమా దేవి, వైస్ ఎంపీపీ లింగమ్మ, సర్పంచ్ మూలింటి రాధమ్మ, సింగిల్ విండో చైర్మన్ కట్టెల గోవర్ధన్, మండల సమైక్య అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, ఎంపీటీసీ తంగరదోన మహాలక్ష్మి, వైకాపా మండల కన్వీనర్ పెద్దయ్య, మాజీ కన్వీనర్ రామాంజనేయులు, పీఎం ఏపిఎం రాఘవేంద్ర, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img