Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఉపాధ్యాయ ఓటరు జాబితాలో అనర్హులను గుర్తించి తొలగించాలి : ఎస్‌ టి యు

విశాలాంధ్ర`ఆస్పరి : పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకున్న అనర్హులను గుర్తించి తక్షణమే తొలగించాలని ఎస్టియు జిల్లా కార్యదర్శి నాగేంద్రప్ప డిమాండ్‌ చేశారు మంగళవారం స్థానిక తాసిల్దార్‌ కార్యాలయం ముందు భోజన విరామ సమయంలో ఎస్‌ టి యు మండల శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు డిప్యూటీ తాసిల్దార్‌ రమణ బాబుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారము ప్రైవేట్‌ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు, అధ్యాపకులు నిరంతరాయంగా 6 సంవత్సరాలుగా పని చేసి ఉండాలని, అలాగే పిఎఫ్‌ ఖాతా తప్పనిసరి ఉండాలన్నారు. ప్రతి నెలా ఆఖరు బ్యాంక్‌ ఖాత ద్వార జీతము తీసుకోవాలనే నిబంధన ఉందన్నారు. ఆస్పరి మండలంలో 12 మంది ఉపాధ్యాయ ఓటరు నమోదు జాబితాను విడుదల చేస్తే అందులో 7 మంది ప్రైవేట్‌ విద్యాసంస్థలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పేర్లు ఉన్నాయని, తక్షణమే పరిశీలించి తగుచర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ జాబితాలో అర్హత లేని వారి పేర్లును చేర్చడం జరిగిందని విచారణ జరిపి తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ టి యు నాయకులు, ఉపాధ్యాయులు శ్రీనివాసులు, శాస్త్రి, విశ్వనాథ్‌, జ్యోతిమూర్తి, లక్ష్మీపతి, రామంజులు రెడ్డి, అల్తాఫ్‌ అహమ్మద, మురళి కృష్ణ, తిమ్మప్ప, నాగేశ్వరరావు, ఉరుకుందు, రంగవలి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img