Friday, May 3, 2024
Friday, May 3, 2024

గ్రామాల పరిశుభ్రతే జగనన్న స్వచ్ఛ సంకల్ప లక్ష్యం

విశాలాంధ్ర, పెద్దకడబూరు : గ్రామాల పరిశుభ్రతే జగనన్న స్వచ్ఛ సంకల్ప లక్ష్యమని, దీనిలో భాగంగా గ్రామాలలో పంచాయతీ ఆధ్వర్యంలో నిర్మించిన సంపద సృష్టి కేంద్రాలను పకడ్బందీగా నిర్వహించాలని డీపీఓ నాగరాజ నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం మండల పరిధిలోని హెచ్ మురవణి గ్రామంలో సంపద సృష్టి కేంద్రాల నిర్వహణపై పంచాయతీ కార్యదర్శులు, అసిస్టెంట్ ఇంజనీర్లు, వీఏఏలకు నిర్వహిస్తున్న డివిజన్ స్థాయి శిక్షణా తరగతులను డీపీఓ నాగరాజు నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీలలోని వ్యర్థ పదార్థాలను సంపద సృష్టి కేంద్రాలకు తరలి సారవంతమైన ఎరువుగా తయారు చేయాలని సూచించారు. ఆదోని డివిజన్ లో 10 మండలాలలో రోజు రెండు మండలాల సిబ్బందికి శిక్షణకు హాజరవుతారని తెలిపారు. అనంతరం హెచ్ మురవణి గ్రామంలో నిర్వహించిన సంపద సృష్టి కేంద్రాన్ని డీపీఓ నాగరాజ నాయుడు పరిశీలించారు. సంపద సృష్టి కేంద్రం నిర్వహణపై పలు సూచనలు చేశారు. అలాగే అక్కడే సాగు చేసిన కూరగాయలు, పండ్ల తోటలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సంపద సృష్టి కేంద్రం ద్వారా తయారైన సేంద్రీయ ఎరువులతోనే కూరగాయలు, తోటలను పెంచి అధిక దిగుబడి సాధించవచ్చునని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకట రమణప్ప, హొళగుంద ఈఓఆర్డీ చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శి, వైసీపీ నేత దేవదానం పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img