Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

దళితుల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్

డి హెచ్ పి ఎస్ గౌరవాధ్యక్షులు కృష్ణమూర్తి
ఘనంగా 115 వ జయంతి వేడుకలు

విశాలాంధ్ర -ఆస్పరి : దళితుల ఆశాజ్యోతి, వివక్షకు వ్యతిరేకంగా పోరాటం సాగించిన పోరాట యోధుడు, సంఘ సంస్కర్త, సామాజిక న్యాయానికి అహర్నిశలు శ్రమించిన బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి, స్వతంత్ర పోరాట వీరుడు బాబు జగ్జీవన్ రామ్ 115 వ జయంతి వేడుకలను దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. బుధవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితి (ణనూ) మండల గౌరవ అధ్యక్షులు కృష్ణమూర్తి మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచి చురుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకుని, అంటరానితనానికి వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేశారని, సత్యాగ్రహంలో, క్విట్‌ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని గుర్తు చేశారు. అతిచిన్న వయసులోనే శాసనసభ్యునిగా ఎన్నికైన బాబూజీ, సుమారు 30ఏళ్లపాటు కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానిగా దేశానికి సేవలందించారని కొనియాడారు. ఆయన సేవలను నిరంతరం స్మరించుకొని, స్ఫూర్తి పొందాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందన్నారు. దళితుల కోసం పోరాటం పోరాడిన మహనీయుడిని మనమంతా స్మరించుకోవాలని అలాగే ఆయన ఆశయ సాధన కొరకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి మండల నాయకులు పులికొండ, యువ నాయకులు అశోక్, శివ, రంగన్న, నాగరాజు, హమాలి సంఘం నాయకులు జైపాల్, సిపిఐ సీనియర్ నాయకులు బ్రహ్మయ్య, ఉరుకుందప్ప, మోట తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img