Friday, April 26, 2024
Friday, April 26, 2024

చంపత్‌ రాయ్‌ భూ కబ్జా…

ప్రశ్నించిన జర్నలిస్టుపై ఎఫ్‌ఐఆర్‌
న్యూదిల్లీ : బిజ్నూర్‌ భూ కుంభకోణానికి సంబంధించి ప్రశ్నించినందుకు గాను సీనియర్‌ జర్నలిస్టు, మరో ఇద్దరిపై ఉత్తరప్రదేశ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వీహెచ్‌పీ నాయకుడు, రామమందిరం ట్రస్టీ సభ్యుడు చంపత్‌ రాయ్‌ సోదరుడు సంజయ్‌ బన్సాల్‌ ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు. స్థానిక భూ మాఫియా ఆక్రమించుకున్న భూమిని బిజ్నూరు గోశాలకు చంప త్‌రాయ్‌ ఇప్పించలేదని ఆరోపించినందుకుగాను ఈ కేసు పెట్టారు. స్థానిక భూమాఫియాతో చంపత్‌రాయ్‌ కుటుంబానికి సంబంధాలు ఉన్నట్లు జర్నలిస్టు ఆధారాలతో సహా బయటపెట్టిన విషయం విదితమే. చంపత్‌ రాయ్‌ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి, వీహెచ్‌పీ నాయకుడు. ఆ ముగ్గురిపై యూపీ పోలీసులు 18 అభియోగాలు మోపారు. బిజ్నూరులో తన సోదరుల ద్వారా భూమి కబ్జా చేసినట్లు రాయ్‌పై జర్నలిస్టు ఆరోపించారు. అల్కా లహోటి యాజమాన్యం కింద గల గోశాలకు చెందిన 20 వేల ఎకరాల భూమిని రాయ్‌ సోదరులు ఆక్రమించుకున్నారని వినీత్‌ నారాయణ్‌ వెల్లడిరచారు. అల్కా లహోటి పేరును సైతం ఎఫ్‌ఐఆర్‌లో పెట్టారని నారాయణ్‌ తెలిపారు. తన భూమి నుంచి ఆక్రమణలు తొలగించడానికి లహోటి కొంత మేరకు ప్రయత్నించారని, సాయం కోసం యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను సైతం ఆమె సంప్రదించారని వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img