Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

ఏకాగ్రత చెదరనీకు

ఎస్‌.ఆర్‌.పృథ్వి,
సెల్‌: 9989223245

మనిషి ఏకాగ్రతను ప్రేమిస్తే
మంచి కార్యాల వైపు నడిపిస్తుంది
అదే ఏకాగ్రత చెదిరితే
మనిషైనా, దేశమైనా సరే
గందరగోళం ఆవహిస్తుంది
మనసును ఎంత అదిమిపట్టినా
మాట వినని గోలే
నల్లని మబ్బులా కమ్మేస్తుంది
శిరస్సు వ్రయ్యలవుతున్నట్టు
మెదడులో వింత కలలు
అంత మాత్రాన శిరస్సు తెగ్గోసుకుంటామా!
వైద్యాన్ని ఆశ్రయించి,
మళ్లీ చిరునవ్వును ఆహ్వానిస్తాం
దేశమైనా అంతేగా!
ఎవరికైనా సరే, సమగ్రతని
దెబ్బతీసే అవసరం కలిగిందంటే
దాని వెనుక స్వప్రయోజనం
శివ తాండవమౌతుంది, లేదా
స్వార్థ రాజకీయం కళ్లు విప్పుతుంది
స్వార్థముంది చూశారూ
మనసులో దూరే అవకాశమిస్తే
చెడు తరంగాలను దాచి
తీపై విస్తరిస్తుంది.
మంచి ఆశయాలను తరిమేసి
కొత్త ఆశలకు శ్రీకారం చుడుతుంది
‘నాది’ అనే అహాన్ని
ఊడల మర్రిని చేస్తుంది.
నీతి విత్తులు మొలకలవ్వకుండ
నేలలోనే అడ్డుకుంటుంది
జాతి విచ్ఛిన్నానికి
ప్రణాళికలు అల్లుతుంది
అవినీతిని సముద్రం చేసి,
మానవత్వం మీది కుసుగొల్పుతుంది
తస్మాత్‌ జాగ్రత్త!
సమాజం మీద కురుస్తున్న
ముళ్ల వానను ఆపేందుకు
ఏకాగ్రతను ఆయుధం చేసుకో
మనసు చుట్టూ, అవినీతిని అడ్డగించే
ఉక్కు కోటను నిర్మించు
నీ రూపమప్పుడు
ఎగురుతున్న దేశ పతాక అవుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img