Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

అప్పుడు ప్రతీకారం తీర్చుకోలేదు : అఖిలేష్‌ యాదవ్‌

లక్నో : తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుత సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ ఒక ఫైల్‌ తన వద్దకు వచ్చిందని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ తెలిపారు. అయినప్పటికీ ద్వేషం, ప్రతీకార రాజకీయాలకు తాము పాల్పడలేదని చెప్పారు. అందుకే ఆ ఫైల్‌ను వెనక్కి పంపినట్లు వెల్లడిరచారు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ, ప్రతిపక్షాలపై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. ఈ నేపథ్యంలో తమను కఠినంగా చేయవద్దని ఆయన సూచించారు. లేనిపక్షంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసిన దానికి ప్రతీకారం తీర్చుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కాగా, ఎస్పీ వ్యవస్థాపకుడు, అఖిలేష్‌ యాదవ్‌ తండ్రి ములాయం సింగ్‌ యాదవ్‌ మరణంతో ఖాళీ అయిన రాంపూర్‌ ఎంపీ స్థానంలో అఖిలేష్‌ భార్య డిరపుల్‌ యాదవ్‌ పోటీ చేస్తున్నారు. ఈ నెల 5న ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుగనున్నది. ఈ నేపథ్యంలో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన అఖిలేష్‌ యాదవ్‌, యూపీలోని అధికార బీజేపీపై ఈ మేరకు మండిపడ్డారు. అలాగే డిప్యూటీ సీఎంలు కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, బ్రజేష్‌ పాఠక్‌ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని, అయితే ఆ ప్రయత్నంలో వారిద్దరూ విఫలమయ్యారని విమర్శించారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎంలైన కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, బ్రజేష్‌ పాఠక్‌కు తాము ఒక ఆఫర్‌ ఇస్తున్నామని అఖిలేష్‌ యాదవ్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img