Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

‘ఇంటింటికీ కోవిడ్‌ టీకా’

రెండు డోసులుగా పూర్తి టీకాలు వేసేలా పని చేయండి
నూతన ఆత్మవిశ్వాసంతో కొత్త సంవత్సరంలోకి ప్రవేశిద్దాం..
40 జిల్లాల కలెక్టర్లతో ప్రధాని మోదీ

న్యూదిల్లీ : కోవిడ్‌`19 టీకా కార్యక్రమాన్ని ఇప్పుడు ఇంటింటికీ తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం స్పష్టం చేశారు. ప్రజలకు రెండవ డోసు వేయడం ద్వారా టీకా కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. 100 కోట్ల టీకా డోసుల మైలురాయిని అధిగమించిన తర్వాత అలసత్వం తగదని హెచ్చరిస్తూ, ‘కొత్త సంక్షోభం రావచ్చు’ అని తెలిపారు. ‘వ్యాధులు, శత్రువులను తక్కువగా అంచనా వేయకూడదని నొక్కిచెప్పడానికి ఒక సూక్తిని ఉటంకిస్తూ, చివరి వరకు పోరాడాలి’ అని అన్నారు. ప్రజలకు కోవిడ్‌ టీకా రెండవ డోసు అందించడంలో సమాన శ్రద్ధ వహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇన్ఫెక్షన్‌ కేసులు తగ్గడం ప్రారంభించినప్పుడల్లా, ప్రజలలో అత్యవసర భావన తగ్గుతుందని అన్నారు. జార్ఖండ్‌, మణిపూర్‌, నాగాలాండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, మహారాష్ట్ర, మేఘాలయ, ఇతర రాష్ట్రాలలో కోవిడ్‌ టీకా కవరేజీ తక్కువగా ఉన్న 40 జిల్లాల జిల్లాల కలెక్టర్‌లతో వర్చువల్‌ విధానంలో సంభాషించిన సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కోవిడ్‌ టీకా గురించి వదంతులు, అపోహల విషయం గురించి మాట్లాడుతూ, దీనికి అవగాహన ఒక్కటే పరిష్కారమని, ఈ విషయంలో మత పెద్దల నుంచి సహాయం తీసుకోవాలని రాష్ట్రాల అధికారులను కోరారు. టీకా ప్రచారం విషయంలో మత పెద్దలు చాలా ఉత్సాహంగా ఉన్నారని ప్రధాని తెలిపారు. కొన్ని రోజుల క్రితం వాటికన్‌లో పోప్‌ ఫ్రాన్సిస్‌తో తన సమావేశాన్ని గుర్తుచేసుకున్న ఆయన, టీకాలపై మత పెద్దల సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ టీకా కేంద్రాలకు ప్రజలను తీసుకెళ్లి వారికి సురక్షితంగా టీకాలు వేయించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయకుండా ఇప్పుడు ఇంటింటికీ కోవిడ్‌ టీకాలు వేసేలా గేర్లు మార్చాలని కోరారు. ‘హర్‌ ఘర్‌ టికా, ఘర్‌-ఘర్‌ టికా’ (ప్రతి ఇంటి వద్దకు టీకా) అనే భావంతో ప్రతి ఇంటికి చేరుకోవాలని ఆరోగ్య కార్యకర్తలను మోదీ కోరారు. రెండు డోసులుగా పూర్తి టీకాలు వేసేలా హర్‌ ఘర్‌ డేటా (ప్రతి తలుపు తట్టడం) స్ఫూర్తితో పని చేయాలని అన్నారు. ఇప్పుడు ప్రతి ఇంటికీ వాక్సినేషన్‌ కార్యక్రమాన్ని తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ‘హర్‌ ఘర్‌ డేటా’ అనే మంత్రంతో టీకా రెండవ డోసు ప్రతి ఇంటికి చేరుకుంటుందని ఆయన చెప్పారు. ప్రతి ఇంటికి వెళ్లేటప్పుడు, టీకా మొదటి డోసుతోపాటు పాటు రెండవ డోసుపై కూడా సమాన శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని మోదీ తెలిపారు. ‘ప్రాధాన్యత ప్రాతిపదికన నిర్ణీత సమయం ఉన్నప్పటికీ రెండవ డోసు తీసుకోని వ్యక్తులను మీరు సంప్రదించాలి. దీనిని విస్మరించడం ప్రపంచంలోని అనేక దేశాలకు సమస్యలను సృష్టించింది’ అని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img