Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఇన్ఫోసిస్‌ పై అమెరికా కోర్టులో దావా వేసిన మాజీ ఉన్నతోద్యోగి

ఇన్ఫోసిస్‌ కు వ్యతిరేకంగా ఆ సంస్థ మాజీ వైస్‌ ప్రెసిడెంట్‌ (హెచ్‌ఆర్‌/మానవ వనరుల నియామకం విభాగం) జిల్‌ ప్రెజీన్‌ అమెరికాలోని న్యూయార్క్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. భారత మూలాలు కలిగిన, పిల్లలు కలిగిన మహిళలను, 50 ఏళ్లు దాటిన వారిని నియమించుకోవద్దని తనను ఇన్ఫోసిస్‌ కోరినట్టు పేర్కొన్నారు. అమెరికాలో వివక్షాపూరిత ఉద్యోగ నియామకాలకు వ్యతిరేకంగా ఇన్ఫోసిస్‌ ఎదుర్కొంటున్న రెండో న్యాయ వ్యాజ్యం ఇది.ప్రెజీన్‌ వ్యాజ్యాన్ని రద్దు చేయాలని కోరుతూ ఇన్ఫోసిస్‌, ఈ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ లు సైతం వ్యాజ్యం వేశారు. మాజీ వైస్‌ ప్రెసిడెంట్‌ అయిన ప్రెజీన్‌ తన ఆరోపణలకు ఆధారాలు చూపించలేదని పేర్కొన్నారు. కానీ, ప్రెజీన్‌ పిటిషన్‌ ను రద్దు చేయాలన్న వినతిని సదరన్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ న్యూయార్క్‌ డిస్ట్రిక్ట్‌ కోర్ట్‌ తిరస్కరించింది. 2018లో ఇన్ఫోసిస్‌ తనను నియమించుకునే నాటికి తనకు 59 ఏళ్లు అని ప్రెజీన్‌ పిటిషన్‌ లో పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్‌ ల నియామకాలకు స్పెషలిస్ట్‌గా పనిచేసినట్టు చెప్పారు. వయసు, లింగం (జెండర్‌), సంతానం ఆధారంగా ఇన్ఫోసిస్‌ లో వివక్ష చూపించే ప్రబల సంస్కృతిని చూసి తాను షాక్‌ కు గురైనట్టు ఆమె వివరించారు. ఈ సంస్కృతిని మార్చడానికి మొదటి రెండు నెలల్లో ఎంతో ప్రయత్నం చేశానని, కానీ ఇన్ఫోసిస్‌ పార్ట్‌ నర్స్‌ నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నట్టు పిటిషన్‌ లో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img