Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఉద్యోగుల వేతనాల పునరుద్ధరణ

ఎయిర్‌ ఇండియా అధికారిక ప్రకటన
దశలవారీగా కరోనా మునుపటి స్థాయికి…

న్యూదిల్లీ : ఎయిర్‌ ఇండియా తన ఉద్యోగుల వేతనాలను కరోనా మహమ్మారి మునుపటి స్థాయికి పునరుద్ధరించింది. దేశంలో కోవిడ్‌`19 క్షీణతతో విమానయాన రంగం కోలుకుంటున్న నేపథ్యంలో దశలవారీగా పునరుద్ధరణ చర్యలు చేపట్టనున్నట్లు ఆ విమానయాన సంస్థ అధికారిక పత్రం మంగళవారం పేర్కొంది. గత రెండేళ్లలో మహమ్మారి ప్రేరేపిత ప్రయాణాల పరిమితి కారణంగా భారత విమానయాన రంగం దెబ్బతిన్నది. దీంతో దేశంలోని అన్ని విమానయాన సంస్థలు తమ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాయి. మహమ్మారి ప్రారంభమైన తర్వాత పైలట్ల ఫ్లయింగ్‌ అలవెన్స్‌, స్పెషల్‌ పే, వైడ్‌ బాడీ అలవెన్స్‌ వరుసగా 35 శాతం, 40 శాతం, 40 శాతం మేర తగ్గాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి పైలట్‌లకు ఫ్లయింగ్‌ అలవెన్స్‌, స్పెషల్‌ పే, వైడ్‌ బాడీ అలవెన్స్‌లను వరుసగా 20 శాతం, 25 శాతం, 25 శాతం మేర పునరుద్ధరిస్తున్నట్లు పత్రంలో పేర్కొంది. అయితే మహమ్మారి గరిష్ఠ సమయంలో క్యాబిన్‌ క్రూ సభ్యుల ఫ్లయింగ్‌ అలవెన్స్‌, వైడ్‌ బాడీ అలవెన్స్‌ వరుసగా 15 శాతం, 20 శాతం తగ్గాయిని, అయితే వాటిని వరుసగా 10, 5 శాతం చొప్పున ఏప్రిల్‌ 1 నుంచి పునరుద్ధరించినట్లు తెలిపింది. అలాగే మహమ్మారి సమయంలో అధికారులు, ఇతర సిబ్బందికి ఇచ్చే అలవెన్సులు వరుసగా 50 శాతం, 30 శాతం కోత పడిరది. ఏప్రిల్‌ 1 నుంచి అధికారుల అలవెన్సులు 25 శాతం పునరుద్ధరిస్తుండగా, ఇతర సిబ్బంది అలవెన్సులు ఏప్రిల్‌ 1 నుంచి మహమ్మారి మునుపటి స్థాయికి పునరుద్ధరించినట్లు వివరించింది. మహమ్మారి సమయంలో విదేశాల్లో ఉన్న భారత ఉద్యోగులకు ఇచ్చే స్థూల పారితోషికం 10 శాతం గరిష్ఠంగా 300 డాలర్లు తగ్గింది. ఈ స్థూల పారితోషికాలు 5 శాతం గరిష్ఠంగా 150 డాలర్లకు, అదేవిధంగా, మహమ్మారి సమయంలో దేశానికి చెందిన అధికారుల స్థూల పారితోషికాలు 300 డాలర్లకు తగ్గాయి. ఏప్రిల్‌ 1 నుంచి 150 డాలర్లకు పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొంది. ‘మహమ్మారి క్షీణిస్తున్న తరుణంలో విమానయాన రంగం మరోసారి పురోగమిస్తున్నందున జీతాల కోతలను సమీక్షించామని, దశలవారీగా జీతాల పునరుద్ధరణ జరుగుతుంది’ అని ఆ పత్రం తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img