Friday, April 26, 2024
Friday, April 26, 2024

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు తప్పిన ప్రమాదం

బీజేపీ సీనియర్‌ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు ల్యాండిరగ్‌ సమయంలో ఇబ్బంది తలెత్తింది. చాకచక్యంగా వ్యవహరించిన పైలట్‌.. హెలికాప్టర్‌ను ల్యాండిరగ్‌ చేయకుండా.. తిరిగి పైకి లేపి వెనక్కి మళ్లించాడు. దీంతో ప్రమాదం తప్పింది. హెలికాప్టర్‌ దిగేందుకు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ చుట్టూ ప్లాస్టిక్‌ షీట్లు, కవర్లు, ఆ పరిసరాల్లో వ్యర్థాలు ఉండటంతో హెలికాప్టర్‌ దిగడంలో ఇబ్బందులు తలెత్తాయి. హెలికాప్టర్‌ రెక్కల గాలికి ప్లాస్టిక్‌ కవర్లు, చెత్త చెదారం పైకి లేచి ఆ ప్రాంతంలో దుమ్ము కమ్ముకుంది. అదే సమయంలో సుడిగాలి వచ్చినట్లు తెలుస్తోంది.కర్ణాటకలోని కాలబురగిలో సోమవారం (మార్చి 6) మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన కారణంగా యడియూరప్ప పర్యటన అర్ధంతరంగా వాయిదా పడినట్లు తెలుస్తోంది. యడియూరప్పకు స్వాగతం పలికేందుకు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్న వారందరూ వెనక్కి వెళ్లిపోయారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఈ ఘటనకు సంబంధించిన వీడియోను న్యూస్‌ ఏజెన్సీ ఏఎన్‌ఐ ట్వీట్‌ చేసింది. ఈ వీడియో వైరల్‌ అవుతోంది..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img