Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

కోవిడ్‌ టీకా ప్రచారంపై పౌర, స్వచ్ఛంద సంస్థలతో ఆరోగ్య మంత్రి భేటీ

న్యూదిల్లీ : దేశవ్యాప్తంగా కోవిడ్‌ టీకా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టేందుకు మార్గాలను చర్చించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవియా అధ్యక్షతన మంగళవారం స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజ గ్రూపులు, అభివృద్ధి భాగస్వామ్యులతో సమావేశం జరిగింది. ఇంకా టీకా డోసు తీసుకోనివారు, రెండవ డోసు గడువు మీరిన వారి కోసం ఇంటింటికీ కోవిడ్‌19 వాక్సినేషన్‌ కోసం ప్రభుత్వం ఇటీవల నెల రోజుల పాటు ాహర్‌ ఘర్‌ దస్తక్‌్ణ పేరుతో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజ సంఘాల మధ్య మెరుగైన భాగస్వామ్యంతో ామన ాహర్‌ ఘర్‌ దస్తక్‌్ణ వాక్సినేషన్‌ ప్రచారాన్ని ఏ విధంగా బలోపేతం చేయాలనే విషయమై చర్చించాం. దేశంలోని ప్రతి మూలకు ఈ ప్రచారాన్ని తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం ఈ సంస్థల మద్దతు కోరుతోంది్ణ అని సమావేశం అనంతరం మాండవియా ట్వీట్‌ చేశారు. ఇంకా 12 కోట్ల మంది కోవిడ్‌19 టీకా రెండవ డోసు వేయించుకోవాల్సి ఉందని ఇటీవల ఆయన పేర్కొన్నారు. కాగా దేశంలోని అర్హులయిన జనాభాలో సుమారు 80 శాతం మందికి టీకా మొదటి డోసును అందించగా, ఇప్పటి వరకు 39 శాతం మందికి పూర్తిగా రెండు డోసులు వేసినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img