Friday, April 26, 2024
Friday, April 26, 2024

కోవిడ్‌19పై..సోషల్‌ మీడియాలో తప్పుడు సమాచారం

భారత్‌లోనే అధికం : సర్వే

న్యూదిల్లీ : కోవిడ్‌19పై భాతర దేశంలోని సోషల్‌ మీడియా అత్యధికంగా తప్పుడు సమాచారాన్ని వెదజల్లుతున్నట్టు ఒక అధ్యయనం తెలిపింది. దేశంలో పెరిగిన ఇంటర్నెట్‌తో సోషల్‌ మీడియా వినియోగం పెరిగినా సరైన అవగాహన లేకపోవడం, నిరక్షరాస్యత వంటి కారణాలతో కోవిడ్‌ -19 విషయంలో సోషల్‌ మీడియా వినియోగ దారులు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్టు ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ లైబ్రరీ అసోసియేషన్స్‌ అండ్‌ ఇనిస్టిట్యూషన్స్‌ తన జర్నల్‌లో ప్రచురించింది. కోవిడ్‌-19 నేపథ్యంలో 138 దేశాలల్లో వ్యాప్తి చెందిన తప్పుడు సమాచారం, ప్రభావం, దాని మూల విశ్లేషణ అనే పేరుతో సేజ్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ అధ్యయనంలో 138 దేశాలలో ఉద్బవించిన 9,657 తప్పుడు సమాచారాలను విశ్లేషించారు. ఇందులో ఒక్క భారత్‌లోనే అత్యధికంగా 18.07 శాతం తప్పుడు సమాచారం వెలువడినట్టు తెలిపింది. యూఎస్‌లో 9.74 శాతం, బ్రెజిల్‌లో 8.57 శాతం, స్పెయిన్‌లో 8.03 శాతం తప్పుడు సమాచారం వ్యాప్తి చెందినట్టు తెలిపింది. ఇందులో 66.87 శాతం తప్పుడు సమాచారం ఫేస్‌బుక్‌ యూజర్ల నుంచే వస్తున్నట్టు తెలిపింది. కరోనా వైరస్‌ విషయంలో వెలువడుతున్న తప్పుడు సమాచారం ప్రజలకు ప్రమాదకరంగా మారుతున్న దశలో ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img