Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

గోవా అభ్యర్థుల్లో 26శాతం మందిపై క్రిమినల్‌ కేసులు

పనాజీ: గోవా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో కనీసం 26 శాతం మందిపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయని, ఇందులో ఎనిమిది శాతం మంది తీవ్ర నేరాలకు పాల్పడినట్లు ఓ నివేదిక వెల్లడిరచింది. క్రిమినల్‌ కేసులున్న అభ్యర్థులు అత్యధికంగా కాంగ్రెస్‌లో ఉండగా, మహారాష్ట్రవాదీ గోమంతక్‌ పార్టీ (ఎంజీపీ), బీజేపీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గోవా ఎలక్షన్‌ వాచ్‌ అండ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) మంగళవారం విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు ఉన్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న మొత్తం 301 మంది అభ్యర్థుల్లో 26 శాతం (77) మందిపై వివిధ కోర్టుల్లో పెండిరగ్‌లో ఉన్న క్రిమినల్‌ కేసులు ఉన్నాయని, వీరిలో ఎనిమిది శాతం మంది తీవ్రమైన క్రిమినల్‌ నేరాలను ఎదుర్కొంటున్నారని నివేదిక పేర్కొంది. కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో కనీసం 35 శాతం, ఎంజీపీ 23 శాతం, బీజేపీ 18 శాతం, ఎన్సీపీ, టీఎంసీ 15 శాతం చొప్పున, ఆప్‌ అభ్యర్థులో 10 శాతం మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని ఏడీఆర్‌ పేర్కొంది. 12 మంది అభ్యర్థులు మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను అఫిడవిట్‌లలో ప్రకటించారని, అందులో ఒకరిపై అత్యాచారానికి సంబంధించిన కేసు ఏడీఆర్‌ గుర్తించింది. ఎనిమిది మంది అభ్యర్థులపై హత్యాయత్నం కేసులు ఉన్నాయి. గోవా రాష్ట్రంలో ఫిబ్రవరి 14న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం మొత్తం 301 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 116 మంది జాతీయ పార్టీలకు చెందినవారు 104 మంది ప్రాంతీయ పార్టీలు, 13 మంది గుర్తింపు లేని పార్టీలు, 68 మంది స్వతంత్రులు ఉన్నారు. మొత్తం 40 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులను నిలబెట్టగా, కాంగ్రెస్‌ 37 స్థానాల్లో, దాని భాగస్వామి గోవా ఫార్వర్డ్‌ పార్టీ (జీఎఫ్‌పీ) మూడిరటిలో పోటీ చేస్తుందని పేర్కొంది.
ఇక తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ (టీఎంసీ) 26, ఎన్‌సీపీ 13, ఆప్‌ 39, శివసేన 11, ఎంజీపీ 13, గోయెంకో స్వాభిమాన్‌ పార్టీ 4, జై మహాభారత్‌ పార్టీ 6, శంభాజీ బ్రిగేడ్‌ మూడు స్థానాల్లో పోటీ చేయనున్నాయి. అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్ల ప్రకారం వారిలో 187 మంది (62 శాతం) కోటీశ్వరులే. కనీసం 31 శాతం మంది అభ్యర్థులు రూ.5 కోట్ల కంటే ఎక్కువ ఆస్తులు, 16 శాతం మంది అభ్యర్థులు రూ.2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల మధ్య, 20 శాతం మంది రూ.10 లక్షల నుంచి రూ. 50 లక్షల మధ్య, 11 శాతం మంది అభ్యర్థులు రూ.10 లక్షల లోపు ఆస్తులు కలిగి ఉన్నారని ఏడీఆర్‌ వెల్లడిరచింది. అయితే బీజేపీ అభ్యర్థుల్లో 95 శాతం మంది, కాంగ్రెస్‌లో 87 శాతం మంది కోటీశ్వరులే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img